Lal Darwaza Bonalu: సందడిగా లాల్ దర్వాజ బోనాలు.. సింహవాహిని చెంత శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు.. వీడియోతో
సింహవాహిని ఆలయంలో బోనాల సందడి కొనసాగుతున్నది.
Hyderabad, July 16: శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు, డప్పుల వాద్యాలు, నృత్యాలు, ఘటాల ఊరేగింపుతో ఆదివారం హైదరాబాద్ (Hyderabad) పాతబస్తీ (Old City) బోనమెత్తనుంది. సింహవాహిని ఆలయంలో (Simhavahini Temple) బోనాల సందడి కొనసాగుతున్నది. ఆషాఢ మాసంలో గోల్కొండ కోట (పూర్వ మంగళవరం) లోని జగదాంబ మహంకాళి ఆలయం నుంచి ప్రారంభమైన బోనాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట అమ్మవారి ఆలయం దాటి పైదరాబాద్ పాతబస్తీలోని సింహవాహిని ప్రాచీన దేవాలయాల్లో ఆదివారం, సోమవారం జరిగే బోనాలతో ఆషాఢమాస బోనాలు ముగియనున్నాయి. ప్రకృతిని ఆరాధించి అమ్మవారిని పూజించే ఆచారం నేటికి తెలంగాణలో ఉందనడానికి బోనాలు నిదర్శనం. బోనం అంటే భోజనం అమ్మవారికి భోజనం సమర్పించడాన్నే బోనం అంటారు. సకలజీవులకు ఆహారం అందించే గ్రామదేవతలకు బోనం సమర్పించడం ఈ పండుగలోని ప్రత్యేకత.1813లో హైదరాబాద్ లో ప్లేగు వ్యాధిప్రభలినప్పుడు వ్యాధిని తరిమి వేయాలని హైదరాబాద్ సికింద్రాబాద్ లో అమ్మవారికి బోనాలు సమర్పించిన చరిత్ర ఉంది.
ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు
పాతబస్తీలోని పలుప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధానంగా ప్రాచీన దేవాలయల రహదారుల్లో ప్రముఖల రాకపోకలుండటంతో ట్రాఫిక్ ఆంక్షలతో పాటుగా భద్రతావలయాలను రూపొందించారు. ఆది,సోమవారాల్లో పాతబస్తీ, అంబర్ పేట,చార్మినార్, మీర్ చౌక్‌నూమా, నయాపూల్, బహుద్దూర్‌పుర పోలీసు స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు చార్మినార్, ఫలక్‌నూమా, ఓల్డ్ సీబీస్, అఫ్జల్ గంజ్, దారుల్ షఫా, ఇంజన్ బౌలిలో బస్సురూట్లను మళ్లించారు. ఈ ఆంక్షలు 16వతేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం వరకు అమల్లో ఉంటాయి.