Hanuman Idol Set on Fire: భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలో ఘోర అపచారం.. మంటల్లో హనుమాన్ విగ్రహం.. విగ్రహం దగ్ధమవ్వడం ఊరికి అరిష్టమంటున్న గ్రామస్తులు (వీడియో)
ముఖ్యంగా తెలంగాణలో ఈ తరహా ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలోని అమరేశ్వర ఆలయంలో ఘోరమైన అపచారం జరిగింది.
Hyderabad, Nov 22: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) దేవాలయాలపై (Temples) దాడులు నిత్యకృత్యంగా మారడం కలకలం రేపుతున్నది. ముఖ్యంగా తెలంగాణలో ఈ తరహా ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలోని అమరేశ్వర ఆలయంలో ఘోరమైన అపచారం జరిగింది. ఆలయం ప్రాంగణంలోని హనుమాన్ విగ్రహం దగ్ధమయ్యింది. గురువారం సాయంత్రం హనుమాన్ విగ్రహం వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు.
Here's Video:
ఊరికి అరిష్టమంటూ..
ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా? లేక ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, ఊళ్లోని హనుమాన్ విగ్రహం దగ్ధం అవడం ఊరికి అరిష్టమంటూ గ్రామస్తులు భయందోళనలకు గురవుతున్నారు.