Agnipath scheme: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాల్పుల్లో మృతి చెందిన రాకేష్ మృతదేహంతో ర్యాలీ, నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు

కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగానే రాకేష్ మృతి చెందారని ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

(Photo-Twitter)

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మృతి చెందిన రాకేష్ మృతదేహానికి నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. నిన్న మృతి చెందిన రాకేష్ మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఉంచారు. ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాకేష్ మృతదేహంతో నిరసన ర్యాలీని నిర్వహించాలని టీఆర్ఎస్ భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగానే రాకేష్ మృతి చెందారని ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

Agnipath Scheme Row: అసలేం జరిగింది..సికింద్రాబాద్‌లో అగ్గి రాజేసిందెవరు, అదుపు తప్పిన యువకులతో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం, క్షణాల్లో రైల్వే స్టేషన్ అంతటా దట్టమైన మంటలు 

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఈరోజు బంద్ కు పిలుపునిచ్చింది. రాకేష్ మృతదేహంతో ర్యాలీ నిర్వహించాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఆర్మీ అభ్యర్థులు కూడా రాకేష్ అంత్యక్రియలకు పెద్దయెత్తున హాజరయ్యే అవకాశముండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.