Mancherial: మంచిర్యాలలో దారుణం, వీధి కుక్కలను బంధించి తిండిపెట్టని వైనం, చనిపోయిన 10 కుక్కలు..మండిపడుతున్న స్థానికులు

వీధి కుక్కలను బంధించి పది రోజులుగా తిండి పెట్టకుండా మర్చిపోయారు సిబ్బంది. మంచిర్యాల పశు సంరక్షణ కేంద్రంలో పది రోజులుగా తిండి లేకపోవడంతో 8 వీధి కుక్కలు మృతి చెందాయి. కొనఊపిరితో మరో 12 శునకాలు కొట్టుమిట్టాడుతున్నాయి.

mancherial animal welfare center..8 stray dogs died(X)

Hyd, Nov 8:  తెలంగాణలోని మంచిర్యాలలో దారునం చోటు చేసుకుంది. వీధి కుక్కలను బంధించి పది రోజులుగా తిండి పెట్టకుండా మర్చిపోయారు సిబ్బంది. మంచిర్యాల పశు సంరక్షణ కేంద్రంలో పది రోజులుగా తిండి లేకపోవడంతో 8 వీధి కుక్కలు మృతి చెందాయి. కొనఊపిరితో మరో 12 శునకాలు కొట్టుమిట్టాడుతున్నాయి.

ఆ ఆస్పత్రి నుంచి భరించలేని దుర్వాసన వస్తుండడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీధి కుక్కలకు కు.ని ఆపరేషన్లు చేసేందుకు మంచిర్యాలలో ప్రత్యేకంగా ఓ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు.

ఆస్పత్రిలో రోజూ 15 శునకాలకు శస్త్రచికిత్సలు చేస్తుంటారు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం 20 శునకాలను సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అయితే, సెప్టెంబరు, అక్టోబరు నెలల జీతాలు ఇవ్వకపోవడంతో సిబ్బంది తమ యాజమాన్యాన్ని నిలదీయగా డాక్టర్ మినహా అందరినీ పది రోజుల క్రితం ఉద్యోగం నుంచి తీసేశారు.   తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం నేడు.. ఈ సందర్భంగా ఆవగింజలతో రేవంత్ చిత్రాన్ని ఆవిష్కరించిన చిత్రకారుడు రాము (వీడియో) 

అప్పటి నుంచి సిబ్బంది ఎవరూ ఆస్పత్రికి రావడం లేదు. అప్పటికే ఆస్పత్రిలో ఉన్న శునకాలకు ఇదే శాపమైంది. ఆలనాపాలన చూసే వారు లేక, ఆకలితో అలమటించి ఎనిమిది కుక్కల వారం క్రితం చనిపోయాయి. మరణించిన శునకాల కళేబరాలు తొలగించే వారు కూడా లేకపోవడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర దుర్గంధం వ్యాపించడంతో మూగ ప్రాణాల నరక యాతన బయటకు తెలిసింది.