Maoist party on Malla Raji Reddy Death: మావోయిస్టు కీలకనేత మల్లారాజిరెడ్డి చనిపోలేదు, క్షేమంగా ఉన్నారంటూ మావోయిస్టు పార్టీ ప్రకటన, అబద్దపు ప్రచారాలు నమ్మొద్దంటూ లేఖ

మావోయిస్టు నేతలు మల్లా రాజిరెడ్డి (Malla Raji Reddy), కట్టా రామచంద్రారెడ్డి క్షేమమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈమేరకు దండకారణ్యం మావోయిస్టు నేత మంగ్లి పేరుతో మంగళవారం ప్రకటన విడుదల చేసింది

Image of Maoist convention used for representational purpose | (Photo Credits: PTI)

Hyderabad, AUG 22: మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి (Malla Raji Reddy) అలియాస్‌ సంగ్రామ్‌ (71) దండకారణ్యంలో మృతి చెందినట్లు వచ్చిన వార్తలను ఆ పార్టీ ఖండించింది. మావోయిస్టు నేతలు మల్లా రాజిరెడ్డి (Malla Raji Reddy), కట్టా రామచంద్రారెడ్డి క్షేమమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈమేరకు దండకారణ్యం మావోయిస్టు నేత మంగ్లి పేరుతో మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ‘‘రాజిరెడ్డి, రామచంద్రారెడ్డి సురక్షితంగా ఉన్నారు. మా పార్టీ నేతల ఆరోగ్యంపై తరచూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దని కోరుతున్నాం’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

Hyderabad Shocker: మీర్‌పేట్‌లో దారుణం, తమ్ముడి ముందే కత్తితో బెదిరించి అక్కపై నలుగురు కామాంధులు అత్యాచారం, కేసు దర్యాప్తు చేస్తున్న రాచకొండ పోలీసులు 

కేంద్రకమిటీ సభ్యుడిగా ఉన్న రాజిరెడ్డి (Malla Raji Reddy) ఇప్పటి వరకు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా సరిహద్దుల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం. రాజిరెడ్డికి పార్టీలో సంగ్రామ్‌తో పాటు సత్తన్న, మీసాల సాయన్న, సాగర్‌, అలోక్‌, దేశ్‌పాండే, ఎస్‌ఎన్‌, లక్ష్మణ్‌ తదితర మారుపేర్లున్నాయి. రాజిరెడ్డిపై గతంలో పోలీసులు రూ.కోటి రివార్డు ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రులపల్లెకు చెందిన రాజిరెడ్డి చిన్ననాటి స్నేహితుడు కృష్ణారెడ్డి భావజాలానికి ఆకర్షితుడై 1975లో ఆర్‌ఎస్‌యూలో చేరారు. 1980లో కొండపల్లి సీతారామయ్య ఏర్పాటుచేసిన పీపుల్స్‌వార్‌లో (Peoples War) చేరారు. అనంతరం వివిధ ప్రాంతాల్లో దళ కమాండర్‌, దళాలకు సమన్వయకర్త, డీసీఎస్‌, ఫారెస్ట్‌ కమిటీ కార్యదర్శిగా వ్యవహరించారు. శిక్షణ ఇవ్వడం వంటి పలు కార్యక్రమాల్లో అత్యంత కీలకంగా పనిచేశారు. ఆయన భార్య రత్నమ్మ సైతం పార్టీలో చేరి డెన్‌కీపర్‌గా పనిచేశారు. 1995 ఉత్తరబస్తర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆమె మృతిచెందారు.



సంబంధిత వార్తలు

KTR: దేవుళ్లను మోసం చేసిన మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి, మూసీని మురికి కూపం చేసిందే కాంగ్రెస్ పార్టీ..కేటీఆర్ ఫైర్, బఫర్‌ జోన్‌లో పేదల ఇండ్లు కూల్చి షాపింగ్ మాల్స్‌కు పర్మిషన్లా?

CM Revanth Reddy: శైవ క్షేత్రాలకు తెలంగాణ ప్రసిద్ధి..కోటి దీపోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆనాటి త్రిలింగ క్షేత్రమే ఈనాటి తెలంగాణ..మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చనలో పాల్గొన్న సీఎం

CM Revanth Reddy: యువతరాన్ని ప్రోత్సహించాలి... శాసనసభకు పోటీ చేసే వయస్సు 21 ఏళ్లకు తగ్గించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దని పిలుపు

MP Raghunandan Rao: మారింది రంగుల జెండా మాత్రమే.. రైతుల బతుకుల్లో మార్పు లేదు..ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్‌ రావు సూచన