Margadarsi Chit Fund Case: మార్గదర్శి డిపాజిట్ల కేసు, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్, రామోజీరావుతో పాటు ఫైనాన్షియర్లకు నోటీసులు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం

ఈ కేసులో రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI), మాజీ ఐజీ కృష్ణంరాజును ఇంప్లీడ్‌ చేసేందుకు అనుమతినిచ్చింది. అలాగే, కేసులో ప్రతివాదులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు, మాజీ ఐపీఎస్‌ అధికారి కృష్ణంరాజుకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ (Justice Ashok Bhushan) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం నోటీసులు జారీ చేసింది.

Supreme Court issues notice to Ramoji Rao, Financiers (Photo-Wikimedia Commons)

Hyderabad, August 11: నిబంధనలకు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో (Margadarsi Chit Fund Case) మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ (Margadarsi Financiers) సంస్థతోపాటు ఆ సంస్థ అధినేత రామోజీరావుకు (Ramoji Rao) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI), మాజీ ఐజీ కృష్ణంరాజును ఇంప్లీడ్‌ చేసేందుకు అనుమతినిచ్చింది. అలాగే, కేసులో ప్రతివాదులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు, మాజీ ఐపీఎస్‌ అధికారి కృష్ణంరాజుకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ (Justice Ashok Bhushan) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం నోటీసులు జారీ చేసింది.

ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు రూ.2,600 కోట్లు డిపాజిట్లు సేకరించారని మాజీ ఐజీ కృష్ణంరాజు (former IG Krishnaraju) ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌యుఎఫ్ (హిందూ జాయింట్‌ ఫ్యామిలీ) (HUF (Hindu Joint Family) వ్యక్తుల సమూహం కాదని, ఆర్బీఐ నిబంధనలు వర్తించవని ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒకరోజు ముందు జస్టిస్‌ రజిని రామోజీరావుపై కేసును కొట్టివేశారు. సెప్టెంబర్ 30 వరకు రైళ్లు రద్దు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చిన ఇండియన్ రైల్వే

దాంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ (Undavalli Arun Kumar) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీలు వ్యాజ్యంపై సోమవారం న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌ సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తున్నారు.ఈ వ్యాజ్యంలో రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ)ను ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను అంగీకరించి... ఆర్బీఐని కూడా ప్రతివాదిగా చేర్చి నోటీసులిచ్చింది.

రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి సంస్థ దాదాపు రూ.2,600 కోట్ల మేరకు డిపాజిట్లు సేకరించిందని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. దీనికి సంబంధించి ట్రయల్‌ కోర్టులో ఉన్న క్రిమినల్‌ కంప్లైంట్‌ను కొట్టివేయాలని కోరుతూ మార్గదర్శి సంస్థ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిందని, దానిని 2018 డిసెంబరు 31న హైకోర్టు కొట్టివేసిందని ఆయన పేర్కొన్నారు.

అయితే, రిజర్వు బ్యాంకు చట్టంలోని సెక్షన్‌ 45(ఎస్‌)ను హైకోర్టు సరిగ్గా అన్వయించలేదని సీనియర్‌ న్యాయవాది ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ వాదించారు. హిందూ అవిభక్త కుటుంబం(హెచ్‌యూఎఫ్‌) కింద ఉన్న సంస్థలకు డిపాజిట్లు సేకరించే అధికారం లేదని వివరించారు. ఈ అంశానికి సంబంధించి 2006లో నాటి ఏపీ ప్రభుత్వం ఆర్బీఐకి లేఖ రాయగా... మార్గదర్శి సంస్థ సెక్షన్‌ 45(ఎస్‌) ప్రకారం లావాదేవీలు జరపడానికి లేదని 2007లో ఆర్బీఐ స్పష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు.