New Delhi, August 10: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో, సెప్టెంబర్ 30 వరకు భారతదేశం అంతటా సాధారణ రైలు సర్వీసులు రద్దు చేస్తూ రైల్వే శాఖ (Indian Railways) కీలక నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ రైళ్ల రద్దును సెప్టెంబర్ 30 వరకు రైల్వే పొడిగించిందనేది వార్తల సారాంశం. అయితే ఈ వార్తలపై ట్విట్టర్ వేదికగా రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది.
ఈ వార్త అబద్దమని ఇంకా దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. ఫేక్ వార్తలను నమ్మవద్దని కోరింది. ఇదిలా ఉంటే రైళ్లను ఆగస్టు 12 వరకు నిలిపివేస్తున్నామని రైల్వే శాఖ గతంలో ప్రకటించిన విషయం విదితమే. అయితే ప్రత్యేకంగా వేసిన 230 రైళ్లు నడుస్దూనే ఉంటాయని భారత రైల్వే తెలిపింది. కరోనా నేపధ్యంలో ప్రజలు రైళ్లలో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వే బోర్డు సూచించింది. మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ తదితర అన్ని రెగ్యులర్ సర్వీసులను రద్దుచేస్తున్నట్టు రైల్వేబోర్డు అప్పట్లో ప్రకటించింది. రైల్వే శాఖ సరికొత్త నిర్ణయం, ఇకపై ఖలాసీ వ్యవస్థకు ముగింపు, ఎటువంటి కొత్త నియామకాలు చేపట్టకూడదని ఉత్తర్వులు జారీ
దేశంలో వరుసగా నాలుగో రోజు 62 వేలకు పైగా పాజిటివ్ కేసులతోపాటు (Coronavirus Cases), ఎనిమిది వందలకు పైగా మరణాలు (Coronavirus Deaths) నమోదయ్యాయి. నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం వరకు 62,064 మంది కొత్తగా కరోనా (New Coronavirus Cases) బారినపడ్డారు.
Here's Ministry of Railways Tweet
Some section of media is reporting that Railways has cancelled all regular trains till 30th September. This is not correct. No new circular has been issued by Ministry of Railways.
Special Mail Express trains shall continue to run.
— Ministry of Railways (@RailMinIndia) August 10, 2020
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 22,15,075కు పెరగగా, మరణాలు 44,386కు చేరాయి. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 6,34,945 కేసులు యాక్టివ్‌గా (Coronavirus Active Cases) ఉండగా, 15,35,744 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 15 లక్షలు దాటిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.