Fire Accident in Kukatpally: కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం, ఫర్నీచర్ షాపులో ఎగిసిపడ్డ అగ్నికీలలు, మరో మూడు షాపులకు పాకిన మంటలు

కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ ప్రధాన రహదారిపై ఉన్న సౌమ్య ఫర్నీచర్ లో ఈ ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.

Fire Accident in Kukatpally (PIC@ X)

Hyderabad, OCT 06: హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో (KPHB Fire accident) భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ ప్రధాన రహదారిపై ఉన్న సౌమ్య ఫర్నీచర్ లో ఈ ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. అగ్నిప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ (Fire Accident) అని గుర్తించారు.

 

మూడు అంతస్తులలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మిగతా మూడు దుకాణలకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.