Sammakka-Sarakka Jatara: రాత్రికి దేవతల వనప్రవేశం, నేటితో ముగియనున్న సమ్మక్క సారక్క జాతర, అమ్మవార్లను దర్శించుకున్న తెలంగాణా సీఎం కేసీఆర్, పలువురు ప్రముఖులు

అమ్మల దర్శనంతో మేడారం (Medaram) అంతా ఆధ్యాత్మిక పారవశ్యంలో మునిగిపోయింది. మేడారం మహాజాతర (Medaram Jatara 2020) కనుల పండువగా సాగుతోంది. సమ్మక్క, సారలమ్మ (Sammakka-Sarakka), పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరడంతో కోనకు శోభ వచ్చింది. నేటితో మేడారం మహాజాతర ముగియనుంది.

Telangana CM KCR visits Medaram Sammakka-Sarakka Jatara, offers prayers (photo-Twitter)

Medaram, Febuary 8: భక్త కోటి పులకించింది. అమ్మల దర్శనంతో మేడారం (Medaram) అంతా ఆధ్యాత్మిక పారవశ్యంలో మునిగిపోయింది. మేడారం మహాజాతర (Medaram Jatara 2020) కనుల పండువగా సాగుతోంది. సమ్మక్క, సారలమ్మ (Sammakka-Sarakka), పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరడంతో కోనకు శోభ వచ్చింది. నేటితో మేడారం సమ్మక్క సారక్క జాతర ముగియనుంది.

ఈ రాత్రికి దేవతల వన ప్రవేశంతో ఈ మహాక్రతువు ముగుస్తుంది. మూడు రోజులుగా కుంభమేళాను తలపించే విధంగా మేడారం పరిసర ప్రాంతాలు మారిపోయాయి. ఇప్పటికే, లక్షల సంఖ్యలో భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు.

మేడారం జాతరకు ఎలా చేరుకోవచ్చు?

ఇద్దరు అమ్మల రాకతో కోరిన కోర్కెలు తీర్చాలని భక్తులు కానుకలు, మొక్కులు చెల్లించారు. కొందరు భక్తులు నిలువు దోపిడీ ఇచ్చేశారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతర భక్తులు అమ్మవార్ల దర్శనానికి విచ్చేశారు. చీరెసారెలు పెట్టి, పసుపు, కుంకుమలు చల్లి, ఒడిబియ్యం పోసి వన దేవతలను కొలిచారు. భారీ సంఖ్యలో వచ్చిన భక్తుల రాకతో మేడారం పరిసరాలు కిటకిటలాడాయి. దర్శనానికి వచ్చిన లక్షలాది మంది భక్తులతో గద్దెల ప్రాంగణం జనసంద్రంగా మారింది.

Here's Medaram Jathara Video

గద్దెలపై ఉన్న అమ్మవార్లను దర్శించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌‌‌ ( Telangana CM KCR), ‌‌‌రాష్ట్ర గవర్నర్ తమిళి సై, హిమాచల్‌‌‌‌ప్రదేశ్‌ గవర్నర్ బండారు దత్తాత్రేయలు విచ్చేశారు.

Here's Telangana CMO Tweet

సారెతో అమ్మవారికి మొక్కులు సమర్పించారు. వీరితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సైతం అమ్మవార్లకు మొక్కుకున్నారు. నేడు జాతరకు ఆఖరి రోజు కావడంతో భక్తుల సంఖ్య రెట్టింపైంది.

Here's Tweet

గద్దెలపై కొలువుదీరిన వనదేవతలను దర్శించుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భారీగా భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. పలువురు ప్రముఖులు, నేతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శనివారం ఉదయం కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా (Union Minister Arjuna Munda) మేడారం జాతరకు విచ్చేసి అమ్మవార్లను దర్శించుకున్నారు.

Here's medaramjatharaofficial Tweet

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతరకు కోట్ల సంఖ్యలో భక్తులు వస్తున్నారని.. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించే అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. త్వరలో గిరిజనల ఆకాంక్ష నెరవేరుతుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. గిరిజనుల వద్ద ఆస్తులు లేకపోయినా.. ఆనందం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జాతీయ పండుగ అంశంపై విన్నవించినట్లు చెప్పారు. మరోసారి జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటానని కేంద్ర మంత్రి తెలిపారు.

మేడారం భక్తులకు ఉచిత వైఫై

రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి (Allola Indrakaran Reddy) మాట్లాడుతూ.. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రమంత్రిని కోరినట్లు చెప్పారు. ఇప్పటి వరకూ 12 లక్షల మంది భక్తులను ఆర్టీసీ బస్సుల ద్వారా గమ్యస్థానాలకు చేర్చినట్టు తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ తెలిపారు.