IPL Auction 2025 Live

‘Millet Man’ PV Sathish Passes Away: ‘మిల్లెట్ మ్యాన్’ పీవీ సతీశ్ కుమార్ కన్నుమూత.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సతీశ్.. చిరుధాన్యాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన సతీశ్

గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు.

Millet Man (Credits: Twitter)

Hyderabad, March 20: ‘మిల్లెట్ మ్యాన్’గా (Millet Man) ప్రపంచ దేశాలకు సుపరిచిరపరిచితమైన పీవీ సతీశ్ (77) (PV Sathish) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని (Hyderabad) ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తి చేసిన సతీశ్.. 20 సంవత్సరాలపాటు దూరదర్శన్‌లో కార్యక్రమ ప్రధాన నిర్వాహకుడిగా పనిచేశారు. 1970లో నాసా, ఇస్రో కలిసి నిర్వహించిన ‘శాటిలైట్  ఇన్‌స్ట్రక్షనల్ టెలివిజన్’ (సైట్) ప్రయోగంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కొందరు మిత్రులతో కలిసి 1985లో జహీరాబాద్ సమీపంలోని పస్తాపూర్‌లో (Pastapur village) డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) (Deccan Development Society) స్థాపించారు. అక్కడ బడుగు వ్యవసాయ, రైతు కూలీ మహిళలను ప్రకృతి సేద్యం దిశగా ప్రోత్సహించారు. 75 గ్రామాల్లోని దాదాపు 5 వేల మందికిపైగా డీడీఎస్‌లో సభ్యులుగా ఉన్నారు.

Corona Alert: దేశంలో మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు.. గత 24 గంటల్లో 1,071 కేసులు.. 130 రోజుల తర్వాత ఇదే మొదటిసారి.. మొత్తంగా 5,915కు పెరిగిన యాక్టివ్ కేసులు.. రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరి మృతి

 

అంతర్జాతీయ స్థాయిలో చిరుధాన్యాలకు గుర్తింపు తీసుకురావడంలో సతీష్ ఎంతో కృషిచేశారు. ప్రకృతి సేద్యం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషికి గాను 2019లో ఐరాస డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ఈక్వేటర్ ప్రైజ్, ప్రిన్స్ ఆల్బర్ట్- మొనాకో ఫౌండేషన్ అవార్డు వంటి అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. సతీశ్ అంత్యక్రియలు నేటి ఉదయం 11 గంటలకు పస్తాపూర్‌లో జరగనున్నాయి.

Viral Video: జనావాసాల మధ్య గింగిరాలు తిరుగుతూ కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. కొలంబియాలో ఘటన.. వీడియో వైరల్