Konda Surekha: తండ్రి ఫాంహౌస్‌లో కొడుకు రోడ్లపై, కేసీఆర్ - కేటీఆర్‌లపై మంత్రి కొండా సురేఖ ఫైర్, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలని సురేఖ సవాల్

మీడియాతో మాట్లాడిన సురేఖ...బీఆర్‌ఎస్‌ను తెలంగాణ ప్రజలు వద్దు అనుకున్నారు కాబట్టే కాంగ్రెస్‌ను గెలిపించారు అన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎంతో మార్పు జరిగింది...కేటీఆర్ మాట్లాడే భాష వాళ్ల నాయన కూడా ఎప్పుడూ మాట్లాడలేదు అన్నారు.

Minister Konda Surekha slams KCR - KTR(video grab0

Hyd, Dec 5:  ఫామ్‌హౌస్‌లో పడుకుని కేటీఆర్ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు అన్నారు మంత్రి కొండా సురేఖ. మీడియాతో మాట్లాడిన సురేఖ...బీఆర్‌ఎస్‌ను తెలంగాణ ప్రజలు వద్దు అనుకున్నారు కాబట్టే కాంగ్రెస్‌ను గెలిపించారు అన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎంతో మార్పు జరిగింది...కేటీఆర్ మాట్లాడే భాష వాళ్ల నాయన కూడా ఎప్పుడూ మాట్లాడలేదు అన్నారు.

తెలంగాణ వస్తుంది అని తెలిశాకే అమెరికా నుంచి నువ్వు, నీ చెల్లి తట్టబుట్ట సర్దుకుని వచ్చారు అని ఆరోపించారు సురేఖ. తెలంగాణ ఉద్యమం క్రెడిట్ కోసమే నీ చెల్లి, నువ్వు రాష్ట్రానికి వచ్చారు...ప్రభుత్వాన్ని పడగొడతా అన్నావంటే నీ విజ్ఞత ఏంటో అర్థం అవుతుందన్నారు. నువ్వు కాదు నీ అయ్యను మాట్లాడమను కేటీఆర్ అని సలహా ఇచ్చారు కొండా సురేఖ.  తెలంగాణ హైకోర్టులో హరీశ్‌ రావుకు ఊరట, ఆయన్ని అరెస్ట్ చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు.. కాంగ్రెస్ నేత చక్రధర్‌ గౌడ్‌కు నోటీసులు 

Here's Video:

కేసీఆర్ మైక్ పట్టుకుంటే ఆయనకు ఆయనే పెద్ద గొప్ప అనుకుంటాడు...మీకు నిజంగా అంత ధైర్యం ఉంటే మమ్మల్ని డైరెక్ట్ గా ఎటాక్ చేయండి అన్నారు. అంతేగానీ ఎక్కడో దాసుకొని మాట్లాడితే కుదరదు...పార్టీ పరంగా కేటీఆర్ మాట్లాడితే ఒకే కానీ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు సురేఖ.



సంబంధిత వార్తలు

Telangana Assembly Sessions: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. కౌశిక్ రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆగ్రహం..తీరు మార్చుకోకపోతే సస్పెండ్ చేస్తానని వార్నింగ్

CM Revanth Reddy: 63 లక్షల మంది మహిళలకు చీరల పంపిణీ, సెర్ఫ్ ద్వారా ఉచితంగా పంపిణీ చేపట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్