Big relief for MLA Harish Rao In Telangana High Court(X)

Hyd, Dec 5:  తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీశ్‌ రావుకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని క్వాష్ పిటిషన్ దాఖల్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం..ఈ కేసులో హరీశ్‌ రావును అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.

అయితే అరెస్టు మినహా తదుపరి దర్యాప్తు చేపట్టవచ్చని స్పష్టం చేసింది. దర్యాప్తునకు సహకరించాలని హరీశ్‌రావుకు సూచించిన న్యాయస్థానం...మాజీ మంత్రిపై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌ నేత చక్రధర్‌గౌడ్‌కు నోటీసులు జారీసింది.

రాజ‌కీయ దురుద్దేశంతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు న‌మోదు చేశార‌ని ..తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే త‌ప్పుడు కేసులు న‌మోదు చేస్తున్నార‌ని హరీశ్‌ రావు మండిపడిన సంగతి తెలిసిందే. ఎఫ్ఐఆర్‌పై ముందుకు వెళ్లకుండా స్టే ఇవ్వాల‌ని కోర్టును కోరగా ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చింది.  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్, ఇదేనా ప్రజా పాలన?..ఇందిరమ్మ రాజ్యం? అంటూ కేటీఆర్ ఫైర్

తన ఫోన్‌ ట్యాపింగ్‌ అయ్యిందంటూ గతంలోనే హరీశ్‌రావుపై కేసు పెట్టారు. ఆగస్టు 29న తనకు ఆపిల్‌ కంపెనీ నుంచి మెయిల్‌ వచ్చిందని ఈ ఏడాది జూన్‌ 19న డీజీపీకి ఫిర్యాదు చేశారు. తర్వాత పోలీసులు పట్టించుకోవడం లేదని హైకోర్టును ఆశ్రయించారు. కొద్దిరోజుల క్రితం పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు హరీశ్ రావుపై కేసు నమోదు చేశారు.