Minister PS Son Suicide: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యక్తిగత అదనపు కార్యదర్శి కుమారుడి ఆత్మహత్య.. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిన కేసులో గతంలో అరెస్ట్

తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యక్తిగత అదనపు కార్యదర్శి దేవేందర్ కుమారుడు అక్షయ్ కుమార్ (23) ఆత్మహత్య చేసుకున్నారు.

Credits: Whatsapp

Hyderabad, Nov 22: తెలంగాణ (Telangana) ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) వ్యక్తిగత అదనపు కార్యదర్శి (Personal Secretary) దేవేందర్ కుమారుడు అక్షయ్ కుమార్ (23) (Akshay Kumar) ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌లోని (Mahabubnagar) మోనప్పగుట్టకు చెందిన దేవేందర్.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు వ్యక్తిగత అదనపు కార్యదర్శిగా ఉన్నారు. ఆయన కుమారుడు అక్షయ్ కుమార్ బీటెక్ పూర్తి చేశారు. గచ్చిబౌలిలోని ఓ ఎమ్మెన్సీ కంపెనీలో ఉద్యోగం రావడంతో పది రోజుల క్రితం ఆయన నగరానికి వచ్చారు. మేనబావ అయిన గల్లా నవీన్ కుమార్ వద్ద ఉంటూ ఉద్యోగానికి వెళ్లి వస్తున్నారు. నవీన్ కుమార్ ఈ నెల 20న  ఊరెళ్లారు. నిన్న ఉదయం ఊరి నుంచి వచ్చిన నవీన్.. ప్లాట్ తలుపులు మూసి ఉండడంతో తలుపు కొట్టారు. ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన ఆయన తన వద్ద నున్న ఇంకో తాళంతో తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. బెడ్రూంలో కనిపించిన దృశ్యం చూసి షాకయ్యారు. అక్షయ్ ఉరి తాడుకు వేలాడుతూ కనిపించాడు. నవీన్ వెంటనే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారొచ్చి మృతదేహాన్ని కిందికి దింపి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

మొన్న ట్విట్టర్, మెటా, నిన్న లైఫ్ట్, ఫిన్ టెక్, అమెజాన్, నేడు జొమాటో.. ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉద్యోగులను ఎందుకు తొలగిస్తున్నారు? మరో ఆర్ధిక మాంద్యానికి ఇది సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు??

ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. కాగా, మహబూబ్‌నగర్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిన కేసులో సెప్టెంబరు 30న పోలీసులు అక్షయ్ సహా నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత బెయిలుపై బయటకు వచ్చిన అక్షయ్ హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయన ఆత్మహత్యకు కారణం తెలియరాకున్నా.. అరెస్ట్ విషయంలో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



సంబంధిత వార్తలు

Anil Kumar Yadav: మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తాం, వైసీపీ నేతల అరెస్టులపై స్పందించిన అనిల్ కుమార్ యాదవ్, పార్టీ మారుతున్నారనే వార్తలు కొట్టివేత

Nitish Kumar Tries to Touch PM Modi's Feet: వీడియో ఇదిగో, ప్రధాని నరేంద్రమోదీ పాదాలను తాకబోయిన నితీష్ కుమార్, కాళ్లని వెనక్కి తీసుకున్న పీఎం

Ponguleti Srinivas Reddy: మరోసారి మంత్రి పొంగులేటి సంచలన కామెంట్స్, తప్పు చేసిన వారికి ఆటంబాంబు పేలబోతోందని కామెంట్,ప్రజాక్షేత్రంలోకి శిక్ష తప్పదని హెచ్చరిక

Sarada Peetham: శారదా పీఠానికి మరో ఎదురు దెబ్బ, గడ్డ భూమిలో శారద పీఠం నిర్మాణం ఉందన్న ఎమ్మార్వో, పై అధికారులను సంప్రదించాక కూల్చివేతలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడి