MLA Raja Singh: రాజాసింగ్‌కు మరోసారి షోకాజ్‌ నోటీసులు, ధర్మం కోసం చావడానికైనా సిద్ధమని తెలిపిన గోషామహల్‌ ఎమ్మెల్యే, జైలుకు పంపినా భయపడేది లేదని వెల్లడి

తాజాగా మంగళ్‌హాట్‌ పోలీసులు. నోటీసుల్లో కోర్టు పేర్కొన్న బెయిల్‌ షరతులను ఉల్లంఘించారని మంగళ్‌హాట్‌ పోలీసులు (Telangana Police) నోటీసులు జారీ చేశారు.

BJP MLA Raja singh

Hyd, Jan 31: గోషామహల్‌ ఎమ్మెల్యే , బీజేపీ సస్పెండ్ నేత రాజాసింగ్‌కు (MLA Raja Singh) మరోసారి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. తాజాగా మంగళ్‌హాట్‌ పోలీసులు. నోటీసుల్లో కోర్టు పేర్కొన్న బెయిల్‌ షరతులను ఉల్లంఘించారని మంగళ్‌హాట్‌ పోలీసులు (Telangana Police) నోటీసులు జారీ చేశారు. అంతకుముందు, పీడీ యాక్ట్‌ కేసులో రాజాసింగ్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పోలీసుల నోటీసులపై రాజాసింగ్‌ స్పందించారు. రాజాసింగ్‌ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు.

పార్టీ మార్పు వార్తలపై స్పందించిన ఈటల రాజేందర్… వీడియోతో

పోలీసులు నోటీసులు ఇచ్చినా, జైలుకు పంపినా భయపడేది లేదు. ధర్మం కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను.. గో హత్య, మతమార్పిడులు, లవ్‌ జిహాద్‌పై చట్టం చేయాలని కోరాను.. ఇందులో మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం ఉన్నాయి. ముంబైలో పాల్గొన్న కార్యక్రమంలో మాట్లాడితే.. నాకు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.