Moinabad Shocker: ఒక్క ముద్దిస్తే రూ. 25 వేలు ఇస్తా, 5 నెలలు రెంట్ కడతా, ఆర్‌ఎంపీ మహిళా డాక్టర్‌ను వేధించిన పేషెంట్, నిర్భయ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు

ఆర్‌ఎంపీ వైద్యురాలితో అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు లైంగికంగా వేధించిన ఓ వ్యక్తిపై నిర్భయ కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన ఘటన (Patient Sexual Harassment on RMP Woman Doctor) రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలో చోటుచేసుకున్నది.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Moinabad,Sep 20: తెలంగాణలో దారుణ ఘటన చోటు (Moinabad Shocker) చేసుకుంది. ఆర్‌ఎంపీ వైద్యురాలితో అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు లైంగికంగా వేధించిన ఓ వ్యక్తిపై నిర్భయ కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన ఘటన (Patient Sexual Harassment on RMP Woman Doctor) రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలో చోటుచేసుకున్నది. మొయినాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ బి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళిత మహిళ ఆర్‌ఎంపీగా స్థానికంగా క్లినిక్‌ నడుపుతున్నారు. అదే గ్రామానికి చెందిన పాటి ప్రసాద్‌రెడ్డి వారం క్రితం ఆమె క్లినిక్‌కు వెళ్లి ఆరోగ్య సమస్యపై వైద్య సలహాలు తీసుకున్నాడు.

అనంతరం ఆమె సెల్‌ నంబర్‌ తీసుకుని కాల్‌ చేయడం, మెస్సేజ్‌లు పెట్టడం ప్రారంభించాడు. అయితే ఆమె నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈనెల 17న మధ్యాహ్నం నేరుగా క్లినిక్‌కు వెళ్లాడు. అక్కడ నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను ప్రేమిస్తున్నా.. ఒక్క ముద్దిస్తే రూ.25 వేలు ఇస్తా, 5 నెలలపాటు క్లినిక్‌ షెట్టర్‌ కిరాయి కడతానంటూ ఆమెను వేధించాడు. అంతటితో ఆగకుండా అసభ్యకర పదజాలంతో దూషించాడు.

జాగ్రత్త...చిన్న పిల్లల పోర్న్ వీడియోలు చూస్తే పోలీసులకు ఇట్టే తెలిసిపోతుంది, చైల్డ్‌ పోర్న్‌ సైట్స్‌ కోసం సెర్చ్‌ చేసే వారిపై ఫోకస్ పెట్టిన NCRB, హైదరాబాద్‌లో 16 మంది అరెస్ట్

ఈ విషయాన్ని ఆమె అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులకు చెప్పగా వారు అతని ఇంటికి వెళ్లే సరికి పరారయ్యాడు. వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ప్రసాద్‌రెడ్డిపై నిర్భయ కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, పట్టుకోవడానికి రెండు బృందాలను ఏర్పాటు చేశామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.