Owaisi demands KCR: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం...కేసీఆర్ స్పందించాలని అసద్ డిమాండ్
త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్, అదేవిధంగా హరీష్ రావు బీజేపీలో చేరితే స్వాగతిస్తామని బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
Hyd, July 17: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాక పుట్టిన సంగతి తెలిసిందే. త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్, అదేవిధంగా హరీష్ రావు బీజేపీలో చేరితే స్వాగతిస్తామని బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రజా నాయకుడు, మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ అని కొనియాడారు సంజయ్. రెండు రోజుల్లో ఓ బీజేపీ సీనియర్ నేత ఆ తర్వాత కేంద్రమంత్రిగా సంజయ్ చేసిన కామెంట్స్‌తో ప్రజల్లో బీఆర్ఎస్ - బీజేపీ విలీనంపై చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో స్పందించారు హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు అసద్. పత్రికల్లో వస్తున్న వార్తలను తాను చదివానని... విలీనం వార్తలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ మజ్లిస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అసద్...ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు తనకు అర్థం కావడం లేదన్నారు. నెల్లూరు భార షాహిద్ దర్గా. మత సామరస్యానికి ప్రతీక. మనదేశంలోని వివిధ రాష్ట్రాల నుండే కాదు విదేశాల నుండి పెద్ద ఎత్తున ఇక్కడ జరిగే రొట్టెల పండుగ కార్యక్రమానికి హాజరవుతారు. నేటి నుండి ఐదు రోజుల పాటు జరిగే రొట్టెల పండగ ప్రారంభమైంది.
ఇక కాశ్మీర్ ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగు భారత జవాన్లు మృతి చెందడం బాధాకరమని దీనిని ఖండిస్తున్నట్లు చెప్పారు ఓవైసీ. మహారాష్ట్రలో ముస్లింల ప్రార్థనా స్థలాలపై దాడులు, మసీదుల విధ్వంసం వంటి ఘటనలు జరుగుతున్నా అక్కడి ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం విడ్డూరంగా ఉందన్నారు ఓవైసీ. మొత్తంగా బీజేపీ - బీఆర్ఎస్ విలీనంపై అసదుద్దీన్ చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.