Rottela Pandaga 2024(ANI)

Vjy, July 17: నెల్లూరు భార షాహిద్ దర్గా. మత సామరస్యానికి ప్రతీక. మనదేశంలోని వివిధ రాష్ట్రాల నుండే కాదు విదేశాల నుండి పెద్ద ఎత్తున ఇక్కడ జరిగే రొట్టెల పండుగ కార్యక్రమానికి హాజరవుతారు. నేటి నుండి ఐదు రోజుల పాటు జరిగే రొట్టెల పండగ ప్రారంభమైంది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది వేలాది మంది ఇక్కడి వచ్చి మొక్కులు తీర్చుకోనుండగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఏటా మొహరం సందర్భంగా రొట్టెల పండగను నిర్వహిస్తుండటం ఆనవాయిగా వస్తోంది. ఒక్కో కోరికకు ఒక్కో రొట్టెను ఇక్కడ సమర్పించాల్సి ఉంటుంది. రొట్టెల పండుగలో అత్యంత ముఖ్యమైన గంధం ఈనెల 18 న జరుగనుంది. దర్గా ప్రాంగణం మొత్తం రంగు రంగుల విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. పండుగకు వచ్చే భక్తులకు మంచి నీరు, భోజనం, పార్కింగ్ పై ప్రత్యేక దృష్టి సారించారు.

ఆరోగ్య రొట్టె, కల్యాణ రొట్టె, విద్యా రొట్టె, వ్యాపార రొట్టె, ఉద్యోగ రొట్టె, సంతాన రొట్టె ఇలా అనేక రకాల రొట్టెలు ఉంటాయి. ఏ కోర్కె కోరుకుంటే ఆరొట్టె తీసుకుంటారు. కోర్కె తీరిన వారు వచ్చే ఏడాది రొట్టెల పండుగ నాడు తిరిగి ఇదే రొట్టెను చెల్లిస్తారు. ఎక్కడ ఏ రొట్టె అందుబాటులో ఉందో తెలిసేలా ప్రత్యేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌లో కీలకంగా మారింది టీడీపీ. బీజేపీ తర్వాత ఎన్డీయే కూటమిలో అతిపెద్ద పార్టీ కావడంతో సంకీర్ణ భాగస్వామ్యాన్ని ఉపయోగించుకుని ఏపీకి వీలైనంత ఎక్కువ నిధులు తేవాలని భావిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.

గతేడాది లక్షల మంది భక్తులు ఈ పండుగకు హాజరుకాగా ఈ సారి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బారాషహీద్‌ దర్గాలో భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా ప్రాథమిక చికిత్స అందించేందుకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. భక్తులకు అవసరమైన చికిత్స అందించేందుకు వైద్య సిబ్బంది, మందులను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు అంబులెన్సులు కూడా అందుబాటులో ఉంచారు.