Chandrababu meet Amith Shah(ANI)

Del, Jul  17:  కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌లో కీలకంగా మారింది టీడీపీ. బీజేపీ తర్వాత ఎన్డీయే కూటమిలో అతిపెద్ద పార్టీ కావడంతో సంకీర్ణ భాగస్వామ్యాన్ని ఉపయోగించుకుని ఏపీకి వీలైనంత ఎక్కువ నిధులు తేవాలని భావిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు చంద్రబాబు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు వీలైనంత ఎక్కువ నిధులు కేటాయించాలని కోరినట్లు సమాచారం.

అలాగే వివిధ అభివృద్ధి పథకాల కోసం ఏపీకి లక్ష కోట్లకు పైగా నిధులు కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. కేంద్రాన్ని కోరుతున్నారు చంద్రబాబు. ఏపీ పునర్‌నిర్మాణానికి సహకరించాలని అమిత్ షాను కోరారు చంద్రబాబు. అలాగే పోలవరం, రాజధాని నిర్మాణం, రోడ్లు హైవేలు, పట్టణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, అర్బన్ డెవలప్ మెంట్ వంటి అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.

దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే భాగస్వామ్య పక్ష రాష్ట్రాలకు ప్రాధాన్యత అధికంగా ఉండాలని విన్నవించినట్లు తెలుస్తోంది. అయితే ఎన్డీయే కూటమిలో మరో కీలక భాగస్వామికి ఉన్న బిహార్ సీఎం నితీష్ కుమార్ సైతం ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు కేంద్ర బడ్జెట్‌లో రూ.30 వేల కోట్లు ఇవ్వాలని అడుగుతుండటంతో తమకు అదే స్థాయిలో కేటాయింపులు ఉండేలా చూడాలని అమిత్‌ షాను చంద్రబాబు కోరారు.ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది బాధితులతోనే కానీ నేరస్తులతో కాదనే విషయం గుర్తుంచుకోవాలని తేల్చిచెప్పారు సీఎం రేవంత్. హైదరాబాద్ సచివాలయంలో కలెక్టర్లు,ఎస్పీలతో నిర్వహించిన సదస్సులో మాట్లాడిన సీఎం రేవంత్...అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. 

ఇక రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులను కలవలనున్నారు చంద్రబాబు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. పదిహేను రోజుల వ్యవధిలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. చంద్రబాబుతో పాటు ఢిల్లీకి వెళ్లిన వారిలో ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న కేంద్ర బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.