Mulugu MLA Seethakka: సచివాలయం కేవలం బీఆర్ఎస్ నేతలకేనా, మమ్మల్ని రావొద్దని సచివాలయం ముందు బోర్డ్ పెట్టండంటూ మండిపడిన ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క

సచివాలయంలోకి అనుమతి లేదని చెప్పడంతో ఆమె కారు దిగి నడుచుకుంటూ లోనికి వెళ్లారు. ఈ క్రమంలో కేసీఆర్‌ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Mulugu MLA Seethakka (Photo-Video Grab)

Hyd, Oct 6: ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్కకు (Mulugu MLA Seethakka) తెలంగాణ సచివాలయంలో చేదు అనుభవం ఎదురైంది. సచివాలయంలోకి అనుమతి లేదని చెప్పడంతో ఆమె కారు దిగి నడుచుకుంటూ లోనికి వెళ్లారు. ఈ క్రమంలో కేసీఆర్‌ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ పనుల కోసం నేను సచివాలయానికి (Telangana secretariat) వెళ్తుంటే అనుమతి లేదని ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నట్టు తెలిపారు.

వివిధ శాఖలకు సంబంధించిన పనులపై తాను సచివాలయానికి వచ్చానని, లోపలికి వెళ్తుంటే పోలీసులు తనను అడ్డుకున్నారని ఆవేదన ‍వ్యక్తం చేశారు. సచివాలయ నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం ఎంతో గొప్పగా చూపిస్తోందని, కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లోనికి ఎందుకు అనుమతించడంలేదని ప్రశ్నించారు. ఇది చాలా అవమానమని, దీనిపై తాను ఏదైనా చేయవచ్చు కానీ.. అలా చేయడం తనకు ఇష్టం లేదన్నారు.

బీఆర్ఎస్ పార్టీకి షాక్, ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ రాజీనామా, వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తానంటూ సవాల్

నేను ప్రజా సమస్యలపై ఇక్కడకు వచ్చానన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల మధ్యకు వచ్చేది ఉండదని, పైగా వచ్చే వాళ్లను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారన్నారని ఆరోపించారు. సచివాలయం కేవలం బీఆర్ఎస్ నేతలకేనా? అని నిలదీశారు. ప్రతిపక్షాలు, ప్రశ్నించే గొంతుకలు రావొద్దని సచివాలయం ముందు బోర్డ్ పెట్టండి అని చురకలు అంటించారు. హోంమంత్రిగా ఉండి గన్‌మెన్లను కొట్టడం ఏమిటి? అని ప్రశ్నించారు. ఈ విషయమై పోలీసులకు పౌరుషం రావాలని, హోంమంత్రి వెంటనే సంబంధిత గన్‌మెన్‌కు క్షమాపణ చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు.



సంబంధిత వార్తలు

Assembly Election Result 2024: మ‌హారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ కు స‌ర్వం సిద్ధం, వ‌య‌నాడ్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి, కౌంటింగ్ కు సంబంధించి పూర్తి వివ‌రాలివే

KCR: దటీజ్ కేసీఆర్, కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు బ్రేక్...గులాబీ బాస్ వ్యూహంతో వెనక్కి తగ్గిన సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో టచ్‌లోకి పార్టీ మారిన ఎమ్మెల్యేలు!

KTR On Adani Issue: అదానితో కాంగ్రెస్ - బీజేపీ అనుబంధం.. దేశానికి అవమానం, తెలంగాణలో అదాని పెట్టుబడుల వెనుక కాంగ్రెస్ వాట ఎంతో బయట పెట్టాలని కేటీఆర్ డిమాండ్

Gautam Adani Charged in Bribery Case: వ్యాపారాల కోసం రూ.2,236 కోట్లు లంచం, అమెరికాలో అదానిపై మోసపూరిత కుట్ర కింద నేరాభియోగాలు, కుప్పకూలిన అదాని గ్రూప్ షేర్లు