TRS Wins Sagar Assembly Seat: సాగర్‌లో గులాబీ రెపరెపలు, నోముల భగత్ విజయం, రెండో స్థానంలో జానారెడ్డి, గల్లంతయిన బీజేపీ, రౌండ్ల వారీగా ఫలితాలు ఇవే

తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం (TRS Wins Sagar Assembly Seat) సాధించారు. నాగార్జున సాగ‌ర్ గ‌డ్డ‌పై (Nagarjuna Sagar assembly) మ‌రోసారి గులాబీ జెండా రెపరెపలాడింది. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ (nomula Bhagat) 18,449 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

nomula bhagath and Late TRS MLA Nomula Narsimhaiah (Photo-Twitter)

Hyderabad, May 2: తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం (TRS Wins Sagar Assembly Seat) సాధించారు. నాగార్జున సాగ‌ర్ గ‌డ్డ‌పై (Nagarjuna Sagar assembly) మ‌రోసారి గులాబీ జెండా రెపరెపలాడింది. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ (nomula Bhagat) 18,449 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దివంగ‌త ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య అకాల మ‌ర‌ణంతో సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది.

క్ర‌మంలో ఏప్రిల్ 17న ఉప ఎన్నిక‌కు పోలింగ్ ప్ర‌క్రియ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఃాగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీకి మొత్తం 87,254 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ పార్టీకి 68, 714 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ పార్టీకి 7,159 ఓట్లు పోలయ్యాయి.

మొత్తం 25 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ తన సమీప ప్రత్యర్థి జానారెడ్డిపై 18,449 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీనిపై మరికాసేపట్లోనే ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేయనుంది. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. ఇక తెలంగాణలో బలం పుంజుకుంటున్నట్టు కనిపించిన బీజేపీ.. సాగర్ ఉప ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది.

కాగా నోముల భ‌గ‌త్ ప్ర‌తి రౌండ్‌లోనూ మంచి ఆధిక్యం క‌న‌బ‌రిచారు. వ‌రుస‌గా తొలి తొమ్మిది రౌండ్ల‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ ఆధిక్యం ప్ర‌ద‌ర్శించ‌గా, 10, 11, 14వ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. మ‌ళ్లీ మిగ‌తా అన్ని రౌండ్ల‌లోనూ టీఆర్ఎస్ పార్టీ దూకుడు ప్రద‌ర్శించింది. ఈ ఎన్నిక‌లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డి రెండో స్థానానికి ప‌రిమితం కాగా, బీజేపీ అభ్య‌ర్థి ర‌వి నాయ‌క్ డిపాజిట్ గ‌ల్లంతు అయింది.

ఎదురులేని దీదీ, మ్యాజిక్ ఫిగర్ క్రాస్, బీజేపీ భారీగా వెనుకంజ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల అడ్రస్ గల్లంతు, నందిగ్రాంలో దూసుకుపోతున్న మమత, బీజేపీ ఓడిపోతే పూర్తి బాధ్యత తానే తీసుకుంటాన‌ని తెలిపిన పార్టీ రాష్ట్ర చీఫ్ దిలీప్ ఘోష్‌

రౌండ్ల వారీగా ఫలితాలు

25వ రౌండ్‌ ముగిసేసరికి 18,449 ఓట్ల మెజారిటీతో భగత్ విజయం సాధించారు

22వ రౌండ్‌ ముగిసేసరికి 16,765 ఓట్ల ఆధిక్యంలో భగత్

19వ రౌండ్ ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ 14476 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 3732, కాంగ్రెస్‌కు 2652 ఓట్లు వచ్చాయి. 18వ రౌండ్లో టీఆర్‌ఎస్‌ లీడ్ 1080 ఓట్లు.

► 18వ రౌండ్ ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ 13396 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 18వ రౌండ్లో టిఆర్‌ఎస్‌కు 4074, కాంగ్రెస్‌కు 2259 ఓట్ల వచ్చాయి. 18వ రౌండ్లో టీఆర్‌ఎస్‌ లీడ్ 1851 ఓట్లు.

► 17వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 11581 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 17వ రౌండ్లో టీఆర్‌ఎస్‌కు 3772, కాంగ్రెస్‌కు 2349 ఓట్లు వచ్చాయి. 16వ రౌండ్లో టీఆర్‌ఎస్‌ లీడ్ 1423 ఓట్లు.

► 16వ రౌండ్ ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ పార్టీ 10158 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్‌ టీఆర్‌ఎస్‌కు 3475, కాంగ్రెస్‌కు 3231ఓట్లు వచ్చాయి. 16వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ లీడ్ 244 ఓట్లు.

► 15వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 9914 ఓట్ల ఆధిక్యంలో ఉంది. కొనసాగుతున్న సాగర్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. 15వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 3203, కాంగ్రెస్‌కు 2787ఓట్లు వచ్చాయి. 15వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ లీడ్ 416 ఓట్లు.

► 14వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ మొత్తం 9498 ఓట్ల ఆధిక్యం. 14వ రౌండ్లో టీఆర్‌ఎస్‌కు 2734, కాంగ్రెస్‌కు 3817 ఓట్లు వచ్చాయి. 14వ రౌండ్‌లో కాంగ్రెస్ లీడ్ 1083 ఓట్లు.

► 13వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 10581 ఓట్ల ఆధిక్యం. 13వ రౌండ్లో టీఆర్‌ఎస్‌కు 3766, కాంగ్రెస్కు 3546 ఓట్లు వచ్చాయి. 13వ రౌండ్లో టీఆర్‌ఎస్‌ లీడ్ 220 ఓట్లు.

► 12వ రౌండ్‌ ముగిసేసరికి 10,361 ఓట్ల ఆధిక్యంలో భగత్ (టీఆర్‌ఎస్‌)

► 11వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 9106 ఓట్ల ఆధిక్యం. ఈ రౌండ్లో టిఆర్‌ఎస్‌కు 3395, కాంగ్రెస్‌కు 2225 ఓట్లు వచ్చాయి. 11వ రౌండ్లో టీఆర్‌ఎస్‌ లీడ్ 1170 ఓట్లు.

►పదో రౌండ్‌ ముగిసేసరికి 7,963 ఓట్ల ఆధిక్యంలో భగత్(టీఆర్‌ఎస్‌).

► ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 7948 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 8వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 3249, కాంగ్రెస్‌కు 1893 ఓట్లు వచ్చాయి. ఎనిమిదో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ లీడ్ 1356 ఓట్లు.

► ఏడో రౌండ్‌ ముగిసేసరికి 6,592 ఓట్ల ఆధిక్యం

► ఆరో రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 5177 ఓట్లతో ఆధిక్యం. ఆరో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 3989, కాంగ్రెస్‌కు 3049 ఓట్లు వచ్చాయి. ఆరో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ లీడ్ 940 ఓట్లు.

► ఐదో రౌండ్‌ ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ 4334 ఓట్లతో ఆధిక్యం

► నాలుగో రౌండ్‌లో 3457 ఓట్ల ఆధిక్యంలో భగత్ (టీఆర్‌ఎస్‌)

► మూడో రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 2665 ఓట్ల ఆధిక్యం. మూడో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 3421, కాంగ్రెస్‌కు 2882 ఓట్లు వచ్చాయి.

► రెండో రౌండ్‌లో ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌. 2216 ఓట్లతో నోముల భగత్‌ ముందంజ

► తొలి రౌండ్‌లో 1475 ఓట్ల ఆధిక్యంలో భగత్ (టీఆర్‌ఎస్‌). తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం. టీఆర్‌ఎస్‌కు 4228 ఓట్లు, కాంగ్రెస్‌కు 2753 ఓట్లు వచ్చాయి

► పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లలో టీఆర్‌ఎస్‌ 394 ఓట్ల ఆధిక్యం ఉంది. మొత్తం 1384 కాగా, చెల్లనివి 51, టీఆర్‌ఎస్‌ 822, కాంగ్రెస్ 428, బీజేపీ 30, టీడీపీ 06 ఓట్లు సాధించాయి.

ఈ విజ‌యంపై నోముల భ‌గ‌త్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ.. నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ఓటర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. త‌న‌ గెలుపు కోసం కృషిచేసిన టీఆర్ఎస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now