IPL Auction 2025 Live

New High Court Building for Telangana: తెలంగాణకు కొత్త హైకోర్టు భవనం, జనవరిలో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

ఈరోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఈ అంశంపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.

Chief Minister Revanth Reddy Orders to Officials necessary arrangements should be made to lay foundation stone of the new Telangana High Court building next January

Hyd, Dec 14: వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ అలోక్ ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఈ అంశంపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రస్తుత హైకోర్టు భవనం శిథలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతను చీఫ్ జస్టిస్, న్యాయవాదులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని సీఎంను కోరారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. సంబంధిత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి, తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ, పూర్తి లిస్ట్ ఇదిగో..

అదేవిధంగా కొత్త జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్ ల నిర్మాణానికి కూడా చొరవ చూపాలని చీఫ్ జస్టిస్, న్యాయవాదులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడున్న హైకోర్టు భవనం హెరిటేజ్ బిల్డింగ్ కాబట్టి దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని కూడా సీఎం గుర్తు చేశారు. ఆ భవనాన్ని రెనోవేట్ చేసి సిటీ కోర్టుకు లేదా ఇతర కోర్టు భవనాలకు వినియోగించుకునేలా చూస్తామని  రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Here's TS CMO Video

ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, సీఎం కార్యదర్శి శ్రీ శేషాద్రి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.