New Ration Cards in Telangana: తెలంగాణలో అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు, కీలక ప్రకటన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
అక్టోబర్‌లో కొత్త రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.రేషన్‌కార్డుల జారీపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం కమిటీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు
Hyd, Sep 16: అక్టోబర్‌లో కొత్త రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.రేషన్‌కార్డుల జారీపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం కమిటీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం(సెప్టెంబర్16) జలసౌధలో మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పదేళ్లలో నామమాత్రంగా రేషన్ కార్డులిచ్చారు. ఖరీఫ్ నుంచిన వడ్లకు క్విటాలుకు 500 అదనంగా ఇవ్వబోతున్నాం జనవరి నుంచిన్ కార్డు దారులకు సన్న బియ్యం ఇస్తాం.
పారదర్శకంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనుకుంటున్నాం. గత ప్రభుత్వ హయాంలో 49476 రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చారు. అవి కూడా బై ఎలక్షన్ ఉన్న నియోజక వర్గాల్లో మాత్రమే ఇచ్చారు. పద్ధతి ప్రకారం ఎక్కడా ఇవ్వలేదు. మా ప్రభుత్వ హయాంలో అర్హులైన అందరికి రేషన్‌కార్డులిస్తాం’అని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయని చెప్పారు. కొత్తగా రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డులు విడివిడిగా అందజేస్తామన్నారు. రేషన్‌కార్డుల జారీకి సంబంధించిన తుది ప్రక్రియ నెలాఖరులోగా పూర్తి చేస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డులు ఇస్తామని తెలిపారు.