Rain Alert For Telangana: తెలంగాణ‌లో రాబోయే మూడు రోజుల పాటూ వ‌ర్షాలు, ప‌లు జిల్లాల‌కు ఐఎండీ అల‌ర్ట్, ఏయే ప్రాంతాల్లో వాన‌లు ప‌డుతాయంటే?

ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను ఆజరీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Telangana Rains Live Updates: Orange alert for 5 districts of Telangana

Hyderabad, SEP 20: తెలంగాణలో రాగల మూడురోజులు (Rain Alert) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను ఆజరీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, మలుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హ‌నుమ‌కొండ‌ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లిలో వర్షాలు కురుస్తాయని చెప్పింది.

NEET Counselling: నీట్ కౌన్సెలింగ్‌లో తెలంగాణ విద్యార్థులకు ఊరట, స్థానికత వ్యవహారంలో రిలీఫ్ ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం 

జయశంకర్‌ భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం పలుచోట్ల ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. ఇవాళ కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్‌ సహా పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి.



సంబంధిత వార్తలు