Cold Wave in Hyderabad: తెలంగాణకు మరోసారి చలిగండం, హైదరాబాద్‌ లో ఉష్ణోగ్రతలు కనిష్టంగా 13 డిగ్రీలకు పడిపోయే అవకాశం, అలర్డ్ జారీ చేసిన ఐఎండీ

రానున్న నాలుగైదు రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశముందని తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం చలితీవ్రత (Cold Wave)మరింత పెరిగే అవకాశమున్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Meteorological Department Hyderabad) వెల్లడించింది.

Winter Season - Representational Image | Photo: IANS

Hyderabad Feb 05: తెలంగాణను మరోసారి చలిపులి (Cold Wave) వణికించే అవకాశముందని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD). రానున్న నాలుగైదు రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశముందని తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం చలితీవ్రత (Cold Wave)మరింత పెరిగే అవకాశమున్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Meteorological Department Hyderabad) వెల్లడించింది. తూర్పు, ఈశాన్య దిశల నుంచి తెలంగాణ (Telangana) రాష్ట్రం వైపు వీస్తున్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ప్రధానంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో చలిగాలులు (Cold Wave) వీచే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో శనివారం అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు హైదరాబాద్‌ (Hyderabad) వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా మెదక్‌లో 11.5 డిగ్రీలు, రామగుండంలో 11.6 డిగ్రీలు, హన్మకొండలో 12.5 డిగ్రీలు, దుండిగల్‌లో 13.6 డిగ్రీలు, హైదరాబాద్‌ (Hyderabad Temperature)లో 13 డిగ్రీలు, నిజామాబాద్‌లో 13.7 డిగ్రీలు, హకీంపేట్‌లో 14.7 డిగ్రీలు, భద్రాచలంలో 15.2 డిగ్రీలు, ఖమ్మంలో 15.4 డిగ్రీలు, నల్లగొండలో 16 డిగ్రీలు రికార్డయయ్యాయి.

జనవరిలో కూడా తెలంగాణలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. వరుసగా వారం రోజుల పాటూ యెల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. ఇక రానున్న రెండు రోజుల పాటూ హైదరాబాద్‌ లో కనిష్టంగా 13 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్ (night temperature) పడిపోయే అవకాశముందని ఐఎండీ తెలిపింది.