Telangana: తెలంగాణ వ్యాప్తంగా ఔట్ పేషెంట్ సేవల ఏర్పాటు, ఇంటింటి సర్వే.. లక్షణాలు ఉంటే కిట్ల పంపిణీ; వ్యాక్సిన్ సరఫరాకు అనుగుణంగా 45 ఏళ్లలోపు వారికి టీకా!

జీహెచ్ఎంసీ తరహా లోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటిలో ప్రతి 1000 జనాభాకు ఒక బృందాన్ని ఏర్పరుచుకొని, ప్రజల ఇండ్ల వద్దకే వెళ్లి అవుట్ రీచ్ కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సీఎస్ తెలిపారు. ఈ టీంలు వారి ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేస్తాయని, ఎవరైనా లక్షణాలు కనబరిస్తే వారికి అక్కడిక్కడే మెడికల్ కిట్లను అందచేస్తారని....

COVID Outbreak - Representational Image (Photo-PTI)

Hyderabad, May 6: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం కోవిడ్ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి నియంత్రణలో ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో లాక్డౌన్ ఉండదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అయితే హైకోర్ట్ సూచన మేరకు వారాంతపు లాక్డౌన్ అంశాన్ని పరిశీలిస్తామని సీఎస్ తెలిపారు. ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలని స్వీయ జాగ్రత్తలు పాటించాలని కోరారు. పుకార్లు విని ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు, పి.హెచ్.సి లు, సబ్ సెంటర్లు, బస్తీ దవాఖానాలలో కోవిడ్ O.P. (Out Patient) ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు అనిపించిన వెంటనే మందుల వాడకాన్ని ప్రారంభించాలని, మెడికల్ కిట్లను వినియోగించాలని 4,5 రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గక పోతే, కిట్ లో ఉన్న స్టేరాయిడ్ లు వాడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.

జీహెచ్ఎంసీ తరహా లోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటిలో ప్రతి 1000 జనాభాకు ఒక బృందాన్ని ఏర్పరుచుకొని, ప్రజల ఇండ్ల వద్దకే వెళ్లి అవుట్ రీచ్ కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సీఎస్ తెలిపారు. ఈ టీంలు వారి ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేస్తాయని, ఎవరైనా లక్షణాలు కనబరిస్తే వారికి అక్కడిక్కడే మెడికల్ కిట్లను అందచేస్తారని అన్నారు. ICMR గైడ్ లైన్స్ ప్రకారం లక్షణాలు కన్పించిన వెంటనే మందుల వినియోగం ప్రారంభించటం వల్ల ఆసుపత్రులలో చేరే అవకాశాలు తగ్గుతాయన్నారు. చికిత్సను జాప్యం లేకుండా తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో అవసరమైన మందులు, కిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరత లేకుండా నియమకాల ప్రక్రియను చేపడుతున్నామన్నారు. ఆసుపత్రులలో పడకల సంఖ్యను పెంచామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కేంద్రాల్లో పడకల సంఖ్యను 18 వేల నుండి 52 వేలకు పెంచామన్నారు. ఆసుపత్రులలో పరిశుభ్రతతో పాటు తగినంత వెలుతురు ఉండడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించామని ప్రధాన కార్యదర్శి తెలిపారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా సిబ్బంది నియమకాలకు కలెక్టర్లకు అనుమతినిచ్చామన్నారు. ఆక్సిజన్ ను వృధా చేయకుండా, ఆసుపత్రులలో ఆడిట్ తో పాటు అధికారులు, టీం లు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసామన్నారు. ఆక్సిజన్ ను అవసరమైన మేరకే వాడుకోవాలని, రాష్ట్ర అవసరాల మేరకు ఆక్సిజన్ సరఫరా చేసేలా నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామన్నారు. డీలర్లు , సరఫరా దారులపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామన్నారు. ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

45 సంవత్సరములు పై బడిన వారికి వ్యాక్సినేషన్ కోసం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళాలన్నారు. జిల్లా అసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల మధ్య సమన్వయం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. కేంద్రం నుంచి పంపిణీ జరిగే వ్యాక్సిన్ సరఫరాకు అనుగుణంగా 18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ అందజేయడానికి విధానపరమైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్ర అవసరాల మేరకు మందులు , టెస్టింగ్ కిట్లు , PPE కిట్లు, మాస్కులు అందుబాటులో ఉన్నాయి, అయితే రాష్ట్రానికి రెమిడెసివిర్ ను అధికంగా కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు సీఎస్ తెలిపారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

CM Revanth Reddy Davos Tour Highlights: దావోస్ వేదికగా తెలంగాణకు ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడుల వివరాలు ఇవే, అమెజాన్‌తో పాటు పలు దిగ్గజ సంస్థలు భారీగా పెట్టుబడులు

Danam Nagender on HYDRAA Demolitions: కూల్చివేతలు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి, హైడ్రా ఫుట్‌పాత్ కూల్చివేతలపై మండిపడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్

Los Angeles Wildfires: వీడియోలు ఇవిగో, లాస్ ఏంజెలెస్‌లో మళ్లీ మంటల కార్చిచ్చు, గంటల వ్యవధిలోనే 9 వేల 400 ఎకరాలు కాలి బూడిద, దాదాపు 50వేల మందిని వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశాలు

Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా ? ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత DGP ద్వారకా తిరుమలరావు, ఇంతకీ ఎవరీ హరీశ్ కుమార్ గుప్తా

Share Now