Kamareddy: ఆ యువతే గొంతు కోసుకుని కట్టు కథ అల్లింది, కామారెడ్డిలో మహిళ హత్యాయత్నం ఘటనను చేధించిన పోలీసులు, గతంలో ప్రేమ వ్యవహారమే ప్రస్తుత ఘటనకు కారణమని అనుమానాలు
దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి తనపై దాడి చేశాడన్న యువతి మాటలు బూటకమని తేల్చారు.
Kamareddy, August 31: కామారెడ్డి మున్సిపాలిటీలోని బర్కత్ పురలో వివాహితపై హత్యాయత్నం (Kamareddy incident) ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి తనపై దాడి చేశాడన్న యువతి మాటలు బూటకమని తేల్చారు. తొలుత వివాహిత పని చేసుకుంటున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆమె గొంతు కోశాడని ప్రచారం జరిగింది. అయితే, కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు వివాహితపై దాడి జరగలేదని నిర్ధరించారు.
తానే గొంతు కోసుకొని.. హత్యాయత్నం జరిగినట్లు నమ్మించిందని (No one attacked choked himself) గుర్తించారు. ఆమెకు తొమ్మిది నెలల కిందట కామారెడ్డికి చెందిన యువకుడితో పెళ్లి జరిగిందని.. గతంలో ప్రేమ వ్యవహారమే ప్రస్తుత ఘటనకు కారణమని అనుమానిస్తున్నారు. రెండు నెలల క్రితం కూడా ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. ఘటన అనంతరం యువతిని స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇక ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని ఆశేపల్లిలో జరిగిన తీజ్ వేడుకల్లో విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు పండుగలో ఆనందంగా పాల్గొనగా ఇంట్లో ఉన్న ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. ఆశేపల్లి గ్రామానికి చెందిన జాదవ్ మెఘాజీ(30) శనివారం రాత్రి కుటుంబ సభ్యులు తీజ్ సంబరాల్లో ఉండగా ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మెఘాజీ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి సోదరుడు జగదీశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు, నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.