Telangana Nominated Posts: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మధుయాష్కి, కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల జాతర, మంత్రివర్గ విస్తరణ కూడా, రేసులో ఉంది ఎవరంటే?
తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ నామినేటెడ్ జాతర మొదలు కానుందా?, సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండనుందా?, ఇందుకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
Hyd, Aug 13: తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ నామినేటెడ్ జాతర మొదలు కానుందా?, సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండనుందా?, ఇందుకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తితో పాటు మంత్రివర్గ విస్తరణ, కొత్త అధ్యక్షుడి ప్రకటనకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి రావడమే తరువాయి. అమెరికా నుండి సీఎం రేవంత్ బుధవారం రానుండగా ఆ తర్వాత రెండు రోజుల్లో నామినేటెడ్ పోస్టుల ప్రకటన ఉండే అవకాశం ఉంద.
పీసీసీ చీఫ్‌గా బీసీ సామాజికవర్గం నుంచి మధుయాష్కి గౌడ్ పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కీలక నేతల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ప్రచార కమిటీ ఛైర్మన్ గా జగ్గారెడ్డికి కీలక బాధ్యలు అప్పగించనున్నారని మరికొంతమంది నేతలకు ఏఐసీసీ కార్యదర్శులుగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల టాక్. సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ బీఆర్‌ఎస్‌దే, గులాబీ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు, డిప్యూటీ సీఎం భట్టికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్న హరీష్ రావు
అలాగే కేబినెట్ విస్తరణ కూడా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం కేబినెట్‌లో ఆరు బెర్తులు ఖాళీగా ఉండగా 4 మంత్రి స్థానాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవుల రేసులో ప్రధానంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, శ్రీహరి ముదిరాజ్, ప్రేమ్ సాగర్ రావు, మల్ రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి.
అయితే ఎవరికి అవకాశం దొరుకుతుంది అన్నది మాత్సం సస్పెన్సే. మొత్తంగా పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కార్యకర్తల్లో జోష్ నెలకొంది. నామినేటెడ్ పోస్టులే కాదు పార్టీ పదవుల కోసం నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.