Hyd, Aug 12: ఖమ్మం జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టును ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం(ఆగస్టు 11న) ట్రయల్ రన్ నిర్వహించింది ప్రభుత్వం. ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు... సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ తీసుకునేందుకు మంత్రులు పోటీ పడుతున్నారని, ఈ నెల 15 న సీఎం రేవంత్ క్రెడిట్ తీసుకునేందుకు ఇంకో ప్రయత్నం చేస్తున్నారు అన్నారు.వాస్తవానికి కేసీఆర్ కలల ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు అని ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ఈ పేరు పెట్టారని చెప్పారు.
ప్రభుత్వం మారడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి రిబ్బన్ కటింగ్ చేసే అవకాశం వచ్చింది అంతమాత్రాన దీనిని తామే నిర్మించామని చెప్పుకునేలా మంత్రుల వ్యవహార తీరు ఉందన్నారు. ఏడు నెలల్లోనే ప్రాజెక్టు పూర్తయిందంటున్న కాంగ్రెస్ నేతలను చూసి జనం నవ్వుకుంటున్నారని, గతంలో ఇదే సీతారామ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించేందుకు కాంగ్రెస్ నేతలు కోర్టులకు వెళ్లారని గుర్తు చేశారు.ఈ విషయాన్ని అపుడు బీ ఆర్ ఎస్ ప్రభుత్వం లో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావే స్వయంగా చెప్పారన్నారు.సీతారామ ప్రాజెక్టును ఘనత కేసీఆర్ ది కాదని తుమ్మల గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా ? అని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భేటీ, శ్రీవారి దర్శనాల్లో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలపై చర్చ
ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఖమ్మం కు గోదావరి జలాలు ఇవ్వాలనే ప్రయత్నం చేయలేదు అని కానీ ఖమ్మం ను రెండు పంటలు పంటే జిల్లాగా మార్చాలని సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ సంకల్పించారు అన్నారు. ఇందిరా ,రాజీవ్ సాగర్ ల ద్వారా 3 వేల క్యూసెక్కుల నీళ్లను ప్రతిపాదిస్తే కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు ద్వారా తొమ్మిది వేల క్యూసెక్కుల నీళ్లు తీసుకునేలా ప్లాన్ చేశారు అన్నారు. కాంగ్రెస్ నేతలు పరాన్న జీవులని మా ఘనత ను వాళ్ళ ఘనత గా చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. బీ ఆర్ ఎస్ హయం లోనే ప్రాజెక్టు 90 శాతం పూర్తయ్యిందని, మెయిన్ కెనాల్ లో ఎనిమిది ప్యాకేజీలు ఉంటె ఐదు ప్యాకేజీలు బీ ఆర్ ఎస్ ప్రభుత్వ హయం లోనే పూర్తయ్యాయని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు కు హైడ్రాలజీ ,అంతర్రాష్ట్ర అనుమతులు బీ ఆర్ ఎస్ ప్రభుత్వ హయం లోనే వచ్చాయని గుర్తు చేశారు.
పాలేరు కు సీతారామ ప్రాజెక్టును కలపడం వల్ల ఖమ్మం పట్టణానికి తాగు నీటి సమస్య లేకుండా పోతుందన్నారు. కేసీఆర్ స్వయంగా ఎన్నో సార్లు ఢిల్లీ వెళ్లి సీతారామ ప్రాజెక్టు కు అనుమతులు సాధించారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ప్రాజెక్టు కు అటవీ శాఖ అనుమతులు సాధించ లేదు అని,.....సాగర్ ఆయకట్టు 3 .4 సీతారామ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా బీ ఆర్ ఎస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిస్తాం అన్నారు. .రాష్ట్రం లో పాలన పడకేసింది ..అంతా గందర గోళంగా మారిందన్నారు. లిక్కర్ టార్గెట్ ల మీద ఈ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది తప్ప ప్రజారోగ్యం మీద పెట్టలేదు అన్నారు. విష జ్వరాల బారిన పడి పిల్లలు చనిపోతున్నారు
..పబ్లిసిటీ స్టంట్ లు తప్ప గవర్నెన్స్ మీద దృష్టి ఏదని ప్రశ్నించారు. 75 కోట్ల రూపాయలతో లక్షన్నర ఎకరాల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెబుతున్న డిప్యూటీ సీఎం భట్టికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని ఎద్దేవా చేశారు.