TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గమనిక, టికెట్‌లోని టోల్ సెస్‌ని సవరించిన టీజీఎస్ఆర్టీసీ, సాధారణ చార్జీలు యథాతథంగానే ఉంటాయని వెల్లడి
దీంతో జాతీయ రహదారులపై అన్ని టోల్ గేట్లలో ఈ రుసుములు స్వల్పంగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ టికెట్ చార్జీల్లో టోల్ గేట్ రుసుములు పెరిగాయి.
Hyderabad, June 12: హైవేలపై టోల్ చార్జీలు పెంచుతూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో జాతీయ రహదారులపై అన్ని టోల్ గేట్లలో ఈ రుసుములు స్వల్పంగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ టికెట్ చార్జీల్లో టోల్ గేట్ రుసుములు పెరిగాయి. టోల్ ప్లాజాలు ఉన్న మార్గాల్లో ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో రూ.3 చొప్పున టోల్ సెస్ రేట్లు పెరిగాయి.
అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. దీంతో పెరిగిన చార్జీలతో వారిపై ఎలాంటి భారం పడే అవకాశం లేదు. సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పుల్లేవని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది.
హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ పెంచిన టోల్ చార్జీల మేరకు టికెట్ లోని టోల్ సెస్ ను సంస్థ సవరించడం జరిగింది. ఈ సవరించిన టోల్ సెస్ ఈ నెల 3వ తేదీ నుంచే అమల్లోకి వచ్చింది. టోల్ ప్లాజాలున్న రూట్లలోనే టోల్ సెస్ ను యాజమాన్యం సవరించామని సంస్థ తెలిపింది.
పెరిగిన టోల్ సెస్ రేట్లు ఇవే
- ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రూ.10గా ఉన్న టోల్ రుసుము రూ.13
- డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో ఉన్న రూ.13గా ఉన్న టోల్ రుసుము రూ.16
- గరుడ ప్లస్ బస్సుల్లో రూ.14 గా ఉన్న టోల్ రుసుము రూ.17
- నాన్ ఏసీ స్లీపర్, హైబ్రీడ్ స్లీపర్ బస్సుల్లో రూ.15 గా ఉన్న టోల్ రుసుము రూ.18
- ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ.20 గా ఉన్న టోల్ రుసుము రూ.23కు పెంచారు.