Omicron scare in TS: తెలంగాణలో కఠిన ఆంక్షలు, పండుగలు, సెలెబ్రేషన్స్ పై ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు, రాష్ట్రంలో 38కి చేరిన ఒమిక్రాన్ బాధితుల సంఖ్య

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు (Telangana high court) ఆదేశాలు జారీ చేసింది. క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకల సందర్భంగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రజలు గుమికూడకుండా ఉండేలా చూడాలని చెప్పింది

High Court of Telangana | (Photo-ANI)

Hyd, Dec 23: తెలంగాణ హైకోర్టులో రాష్ట్రంలోని కరోనా పరిస్థితి గురించి ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు (Telangana high court) ఆదేశాలు జారీ చేసింది. క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకల సందర్భంగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రజలు గుమికూడకుండా ఉండేలా చూడాలని చెప్పింది. రాష్ట్రంలోకి ఒమిక్రాన్ వేరియంట్ (Omicron scare in TS) ఇప్పటికే ప్రవేశించిందని... వేగంగా వ్యాప్తి చెందే ఈ వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. కొత్త వేరియంట్ వ్యాప్తిని అరికట్టేందుకు పండుగలు, సెలెబ్రేషన్స్ పై ఆంక్షలు విధించాలని హైకోర్టు ఆదేశించింది.

రెండు, మూడు రోజుల్లో ఈ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేయాల‌ని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వానికి సూచ‌న చేసింది. ఢిల్లీ, మ‌హారాష్ట్ర త‌ర‌హా నిబంధ‌న‌లు ప‌రిశీలించాని కోర్టు సూచించింది. రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లో కొవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఆదేశించింది. ఒమిక్రాన్‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ(Telangana)లో ఒమిక్రాన్(Omicron) కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మరో 14 ఒమిక్రాన్‌ వేరియంట్‌(Omicron variant) కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇంత ఎక్కువ సంఖ్యలో ఒమిక్రాన్‌ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. 14 మందిలో రిస్క్‌ దేశంగా గుర్తించిన యూకే(UK) నుంచి వచ్చిన ప్రయాణికులు ఇద్దరుండగా.. నాన్‌ రిస్క్‌ దేశాలుగా పేర్కొన్న కెన్యా(Kenya), సోమాలియా(Somalia) దేశాల నుంచి వచ్చినవారు 12 మంది ఉన్నారు.

ఒక్కరోజే 14 ఒమిక్రాన్ కేసులు, తెలంగాణ కొత్త వేరియంట్ డేంజర్ బెల్స్, మొత్తం 38కి చేరిన ఒమిక్రాన్ కేసులు

వీరిలో ముగ్గురు మహిళలు కాగా 11 మంది పురుషులున్నారు. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్‌ వేరియంట్‌(Omicron variant) బాధితుల సంఖ్య 38కి చేరింది. ఇందులో 31 మంది నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. ఆరుగురు రిస్క్‌ దేశాల నుంచి రాగా, తొలిసారిగా ఒకరికి తెలంగాణలో ఒమిక్రాన్‌ సోకింది.