Telangana: దారుణం, కొడుకుని చదివించి సీఐ చేస్తే ఆస్తి కోసం దారుణంగా వారిని కొట్టిన పోలీస్ అధికారి, న్యాయం చేయాలంటూ డీజీపీకి మొరపెట్టుకున్న బాధితులు
తన కొడుకు నుండి రక్షణ కల్పించాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం వెంకటాయింపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Hyd, August 6: కొడుకుని చదివించి సీఐ చేస్తే ఆస్తి కోసం మమ్మల్ని కొడుతున్నారంటూ తల్లిదండ్రులు తమ కుమారుడిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. తన కొడుకు నుండి రక్షణ కల్పించాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం వెంకటాయింపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం, వెంకటాయింపల్లికి చెందిన రఘునాథ్‌రెడ్డి, బొజ్జమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కొడుకు నాగేశ్వర్‌రెడ్డి రాచకొండ కమిషనరేట్‌లో ఓ స్టేషన్ సీఐ, చిన్నకొడుకు యాదయ్య కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. సీఐ పుట్టినరోజు వేడుకలు, భవనం మూడో అంతస్తు పై నుంచి పడి హెడ్ కానిస్టేబుల్ మృతి, కూకట్‌పల్లిలో విషాదకర ఘటన
రఘునాథ్‌రెడ్డికి ఉన్న 30 ఎకరాల 23 గుంటల భూమిలో.. పెద్దకొడుకు పేరున 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరున 11 ఎకరాలు పట్టాచేశాడు. మిగిలిన భూమిని కూతుళ్లకు ఇచ్చేందుకు తమ పేరున ఉంచుకున్నారు. ఈ భూమిపై పెద్దకొడుకు, సీఐ నాగేశ్వర్‌రెడ్డి కన్ను పడింది. తోబుట్టువులకు తానే దగ్గరుండి పంచాల్సింది పోయి, ఆ భూమిని కొట్టేసేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడు.
తన పేరున ఇంకో 5 ఎకరాలు పట్టా చేయాలని వృద్ధులైన తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాడు. ఇష్టమొచ్చినట్లు దూషిస్తూ పలుమార్లు వారిపై దాడి చేశాడు. పెద్ద కొడుకు వేధింపులు తాళలేక చిన్న కొడుకు యాదయ్య ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయాలన్నీ డీజీపీ జితేందర్‌కు ఆ వృద్ధ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ మొరపెట్టుకున్నారు. తన కొడుకు నాగేశ్వర్‌రెడ్డిపై చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఈ విషయంపై విచారణ చేయిస్తామని, ఇబ్బంది లేకుండా చూస్తామని డీజీపీ వారికి హామీ ఇచ్చినట్టు తెలిసింది.