PM Modi Hyderabad Tour: మే 26న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ, తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్ధేశం చేసే అవకాశం, పొలిటికల్ హీట్ పెంచే అవకాశం, అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో సర్వత్రా ఆసక్తి
ఆయన ISB కాన్వకేషన్‌లో (ISB Convocation) పాల్గొనడానికి ఈనెల 26న ఉదయం హైదరాబాద్ రానున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఇవి రెగ్యులర్‌గా జరిగే అభివృద్ధి కార్యక్రమాలే అయినా తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు నడుస్తున్న సమయంలో ప్రధాని మోదీ పర్యటన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.
Hyderabad, May 19: ప్రధాని మోదీ (Modi) తెలంగాణ పర్యటన రాజకీయ ఆసక్తిని రేపుతోంది. ఆయన ISB కాన్వకేషన్‌లో (ISB Convocation) పాల్గొనడానికి ఈనెల 26న ఉదయం హైదరాబాద్ రానున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని (Ramagundam Fertilizer) వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఇవి రెగ్యులర్‌గా జరిగే అభివృద్ధి కార్యక్రమాలే అయినా తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు నడుస్తున్న సమయంలో ప్రధాని మోదీ పర్యటన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. ఐఎస్ బీ కాన్వకేషన్ మధ్యాహ్నం జరగనుంది. ప్రధాని మాత్రం ఉదయాన్నే హైదరాబాద్ (Hyderabad) రానున్నారు. దీంతో కొన్ని గంటల పాటు ఆయన బీజేపీ నేతలతో సమావేశం అవుతారని తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్‌లోనే ప్రధాని తెలంగాణ బీజేపీ నేతలను (Telanagana BJP Leaders) కలవనున్నారు. తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు మోదీ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
వారం రోజుల క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్ వచ్చారు. అంతకుముందు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా తెలంగాణలో పర్యటించారు. ఇక 20 రోజుల వ్యవధిలోనే మరో అగ్రనేత మోదీ హైదరాబాద్ రానుండడం పొలిటికల్‌గా ఉత్కంఠ రేపుతోంది. ఇటీవల బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర ముగిసిన సమయంలోనూ ప్రధాని ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు.
బాగా పోరాడుతున్నారని కితాబు ఇచ్చారు. ఇప్పుడు వారికి ప్రధాని ఏం దిశానిర్దేశం చేయబోతున్నారన్నది ఆసక్తిని రేపుతోంది.కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, టీఆర్ఎస్‌కు ఎలా కౌంటర్ ఇవ్వాలి, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించాలన్నదానిపై దిశానిర్దేశం చేస్తారని స్థానిక బీజేపీ నేతలు చెబుతున్నారు.
మోదీ పర్యటనను విజయవంతం చేసేలా బండి సంజయ్ కసరత్తు చేస్తున్నారు. జంటనగరాల్లో మోదీకి స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నారు. అగ్రనేతలు తెలంగాణపై ఫోకస్ పెట్టడంతో స్థానిక బీజేపీ నేతల్లో జోష్ కనిపిస్తోంది.