Supreme Court on GST: జీఎస్టీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు చట్టాలు చేసుకోవచ్చు, జీఎస్టీ కౌన్సిల్ సిఫారసులు కట్టుబడాల్సిన అవసరం లేదని తీర్పు
GST Revenue Collection - Representational Image. | (Photo Credits: PTI/File)

New Delhi, May 19: జీఎస్టీపై (GST) సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పునిచ్చింది. జీఎస్టీ కౌన్సిల్ (GST Council) సిఫారసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అంతేకాదు అవసరమైతే ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాలు, పార్లమెంట్ చట్టాలు చేసుకోవచ్చు అని జస్టిస్ చంద్రచూడ్ (Justic Chandrachud)ధర్మాసనం గురువారం  వెల్లడించింది. దీనికి సంబంధించి కేంద్ర, రాష్ట్రాలకు సమాన అధికారులున్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఆర్టికల్ 246A, 279 కింద ఉన్న నిబంధనల ప్రకారం పన్నుల విషయాలపై చట్టాలు చేయడానికి కేంద్ర, రాష్ట్రాలకు సమాన అధికారాలు ఉన్నాయని, ఒకదానికొకటి స్వతంత్రంగా వ్యవహరించ లేవని.. ఒకరి ఆదేశాలను మరొకరిపై బలవంతంగా రుద్దొద్దని కూడా ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ఏకాభిప్రాయం రావడానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య చర్చలు జరగాల్సి అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

GST on Online Gaming: ఆన్‌లైన్ గేములు ఆడేవారికి భారీ షాక్, పందెం కట్టే మొత్తంపై 28 శాతం పన్ను, supremఇప్పటివరకు 18 శాతం జీఎస్టీ అమల్లో.., సిఫారసు చేసిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందం  

నిబంధనలు పన్నుల విషయాలపై చట్టాలు చేయడానికి రాష్ట్రాలు, కేంద్రాలకు సమాన అధికారులు ఉన్నాయని గుర్తు చేసింది. కోఆపరిటివ్ పెడరలిజం సూత్రాలను కోర్టు తీర్పు హైలెట్ చేసింది.జీఎస్టీ 2007 ప్రకారంగా సముద్ర రవాణాపై పన్ను విధించడానికి సంబంధించి గుజరాత్ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన అప్పిల్ పై సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది.

జీఎస్టీ 2007 (GST) ప్రకారంగా సముద్ర రవాణాపై పన్ను విధించడానికి సంబంధించి గుజరాత్ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన అప్పిల్ పై సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఓడలో వస్తువుల రవాణా సేవలపై 5 శాతం ఐజీఎస్టీ విధించాలని 2017 ప్రభుత్వం నోటిపికేషన్ ను హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు తీర్పును ఇవాళ సుప్రీంకోర్టు సమర్ధించింది.

Navjot Singh Sidhu: నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష, 30 ఏళ్ల క్రితం నాటి కేసులో తుది తీర్పును వెలువరించిన సుప్రీం కోర్టు  

మోహిత్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ , కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన కేసులో హైకోర్టు ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. రివర్స్ చార్జీ కింద సముద్రపు సరుకు రవాణాపై దిగుమతిదారులపై కూడా ఐజీఎస్టీ విధించడాన్ని గుజరాత్ హైకోర్టు 2020లో రద్దుచేసింది. ఇదే తీర్పును ఇవాళ సుప్రీంకోర్టు సమర్ధించింది. కేంద్ర ప్రభుత్వం 2017 జూన్ లో నోటిఫికేషన్ 8 ద్వారా నౌకలో వస్తువుల రవాణా సేవపై 5 శాతం ఐజీఎస్టీని విధించింది. ఈ నోటిఫికేషన్ ను హైకోర్టు రద్దు చేసింది.