Chintamaneni Escaped: మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై మరో కేసు? కోడిపందాలు నిర్వహిస్తుండగా పోలీసుల మెరుపు దాడి, స్పాట్ నుంచి తప్పించుకున్న చింతమనేని, మాజీ ఎమ్మెల్యే కోసం గాలిస్తున్న పోలీసులు, నిందితుల నుంచి రూ 13లక్షలు స్వాధీనం
వీరిలో ఏపీలోని దెందలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు(TDP Leader) చింతమనేని (Chinthamaneni prabhakar)ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో రూ.13,12,140 స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad, July 07: హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ హౌజుల్లో (farm house) కోడిపందాలు (rooster fight) ఆడుతున్న వ్యక్తులపై పోలీసులు దాడులు చేశారు. పటాన్ చెరు (patancheru) మండల పరిధిలోలని ఓ ఫాంహౌజ్ లో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. అయితే పోలీసుల రాకను గమనించిన పలువురు చెట్ల పొదలు దూరి పరారయ్యారు. వీరిలో ఏపీలోని దెందలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు(TDP Leader) చింతమనేని (Chinthamaneni prabhakar)ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో రూ.13,12,140 స్వాధీనం చేసుకున్నారు. 32 కోళ్లు, 26 వాహనాలు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు పటాన్‌చెరు డీఎస్పీ భీంరెడ్డి నేతృత్వంలో ఎస్పీ రమణకుమార్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి సంగారెడ్డి(Sangareddy) జిల్లా పటాన్‌చెరు మండలం చిన్నకంజర్ల గ్రామ శివారులోని ఒక ఫాంహౌస్‌పై పోలీసులు దాడి చేశారు. ఇద్దరిని అరెస్టు చేశారు.
కోడిపందాలను నిర్వహిస్తున్న వారిలో టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఉన్నట్లు సమాచారం. ఆయన ప్రోద్భలంతోనే కోడిపందాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న వారి నుంచి దీనికి సంబంధించిన పూర్తిసమాచారాన్ని సేకరిస్తున్నారు.
పరారైన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఫాంహౌస్ ను ఎస్పీ రమణకుమార్ చేరుకొని పరిశీలించారు. డీఎస్పీ, సీఐల వద్ద వివరాలు సేకరించారు. ఘటనాస్థలిలో రూ.13 లక్షలకు పైగా నగదుతో పాటు కార్లు, బైక్‌లు, కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు జరిపిన దాడిలో 20 మందికి పైగా బెట్టింగ్ రాయుళ్లు పరారైనట్లు తెలుస్తోంది. ఈ ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుంటున్నారు పోలీసులు.