Hyderabad, July 06: తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నారు. గడిచి రెండురోజులుగా పడుతున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. అయితే మరో 24 గంటల పాటూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తెలంగాణ (Telangana) వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. వర్షాలు(rains) కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 30 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. నాగర్‌కర్నూల్ (nagar karnool), పెద్దపల్లి (Peddapalli), నిర్మల్ (nirmal), నల్లగొండ (nalgonda), మంచిర్యాల (Manchiryal), మహబూబ్‌నగర్ (Mahaboobnagar), వనపర్తి (Wanaparthy) జిల్లాల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఈనెల10వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) July 6, 2022
గురువారం నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది.
రాష్ట్రంపై నైరుతి రుతుపవనాలు (Monsoon)చురుకుగా కదులుతుండటంతో దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలాఉంటే హైదరాబాద్ (Hyderabad) లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ (IMD)తెలిపింది. బుధవారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. పలు ప్రాంతాల్లో జల్లులతో కూడిన వర్షం పడగా, పలు ఏరియాల్లో భారీ వర్షం కురిసి రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.