Ponguleti Joined in Congress: కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్‌ఎస్ సర్కారును బంగాళాఖాతంలో కలుపుతామన్న భట్టి విక్రమార్క

అలాగే, పలువురు నేతలను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాహుల్ గాంధీ.సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయనను రాహుల్ సత్కరించారు.

Ponguleti Srinivasa Reddy (Photo-Video Grab)

Khammam, July 02: ఖమ్మంలో నిర్వహించిన జనగర్జన సభలో కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో ఆ పార్టీలో చేరారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అలాగే, పలువురు నేతలను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాహుల్ గాంధీ.సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయనను రాహుల్ సత్కరించారు. ఎమ్మెల్యే సీతక్కను కూడా భుజం తట్టి అభినందించారు రాహుల్. వేదికపై రాహుల్ గాంధీకి ప్రజా గాయకుడు గద్దర్ ముద్దు పెట్టారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఇందులో రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న అనంతరం పొంగులేటి మాట్లాడారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని పొంగులేటి అన్నారు. కేసీఆర్ మాయమాటలతో రెండు సార్లు అధికారంలోకి వచ్చారని ఆయన విమర్శించారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్ ఆ పని చేయలేదని గుర్తుచేశారు.

Rahul Gandhi At Khammam: బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే! అధికారంలోకి వస్తే వృద్ధులకు రూ.4వేలు పెన్షన్, ఖమ్మం సభలో రాహుల్ గాంధీ 

రాష్ట్రంలో 8 వేలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పొంగులేటి అన్నారు. ఖమ్మం సభకు తరలివచ్చిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. భావిభారత్ కు రాహుల్ గాంధీ దిక్సూచి అని అన్నారు. కేసీఆర్ సర్కారును బంగాళాఖాతంలో కలపాలని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని చెప్పారు. ఉద్యోగాలు రాక యువత ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.

Khammam Jana Garjana: ఖమ్మంలో నేడు కాంగ్రెస్ జన గర్జన సభ.. వంద ఎకరాల్లో దాదాపు ఐదు లక్షల మందితో నిర్వహణ.. ఇప్పుడు అందరి చూపు ఖమ్మం సభ వైపే.. వేదికసాక్షిగా ఎన్నికల శంఖారావం పూరించనున్న రాహుల్.. రాజకీయ పక్షాల ఆసక్తి 

అంతకుముందు ఖమ్మం సభా ప్రాంగణం వద్ద హెలికాప్టర్ దిగగానే చేరుకోగానే గాంధీని కాంగ్రెస్ కార్యకర్తలు చుట్టుముట్టారు. వారికి అభివాదం చేస్తూ వేదికపైకి వెళ్లారు. రాహుల్ గాంధీతో పాటు వేదికపై రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మాణిక్‌రావు ఠాక్రే, గిడుగు రుద్రరాజు, ఇతర కీలక కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

ఖమ్మంలో కాంగ్రెస్ తలపెట్టిన ‘తెలంగాణ జన గర్జన’ బీఆర్ఎస్ వెన్నులో వణుకుపుట్టిస్తోందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి అన్నారు. సభకు వచ్చే అశేష జనవాహినికి ట్రాన్స్ పోర్టు అడ్డంకులు సృష్టించి, సంక్షేమం కట్ చేస్తామని బెదిరించి ప్రభంజనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. అధికారులు పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.



సంబంధిత వార్తలు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

One Nation-One Election: పార్లమెంటుకు జమిలి బిల్లు నేడే.. లోక్‌ సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Telangana: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే ఇన్వెస్టర్లు భయపడుతున్నారు, మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు