Prajapalana: ప్రజాపాలనకు పోటెత్తిన జనం.. మొదటిరోజే 7.46 లక్షల అభయహస్తం దరఖాస్తుల రాక.. ఫాం నింపడంలో సందేహాలు ఎదురైతే, ఏం చేయాలంటే??

అధికారుల బృందాలు గ్రామాలు, పట్టణ ప్రాంతాలకు వెళ్లి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాయి.

Telangana CM Revanth Reddy released the application form of six guarantees along with the Prajapalana logo in the secretariat

Hyderabad, Dec 29: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన (Prajapalana) కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. అధికారుల బృందాలు గ్రామాలు, పట్టణ ప్రాంతాలకు వెళ్లి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. దరఖాస్తుల సమర్పణకు పౌరులు పోటెత్తారు. మొదటిరోజు 7,46, 414 దరఖాస్తులు స్వీకరించినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి 2,88,711 దరఖాస్తులు వచ్చాయని, పట్టణ ప్రాంతాల్లో 4,57,703 మంది దరఖాస్తు చేసుకొన్నారని వెల్లడించారు.

Telangana: ఆధార్ కార్డ్ లింకు చేసుకోడానికి జనాలు బారులు, ఈ సేవాకేంద్రం వద్ద చెప్పులతో భారీ క్యూలైన్‌ ఇదిగో.. 

దరఖాస్తుల కొరత

దరఖాస్తు ఫారాలను ప్రజలకు అధికారులు ఉచితంగా ఇవ్వాలని, వాటిని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ప్రధాన కార్యదర్శి హెచ్చరించారు. అయితే, ఈ కార్యక్రమంలో తొలిరోజే అనేక చోట్ల గందరగోళం నెలకొన్నది. చాలాచోట్ల దరఖాస్తు ఫారాల కొరత ఏర్పడింది. ఇదే అదనుగా జిరాక్స్‌ సెంటర్ల యజమానులు ఒక్కో దరఖాస్తు ఫారం జిరాక్స్‌ తీసేందుకు రూ.30 నుంచి రూ.100 వరకు కూడా వసూలు చేశారు.

Cyber Alert on Telegram Links: టెలిగ్రామ్ లో ఫ్రీగా సినిమాలు చూస్తున్నారా? అయితే మీ బ్యాంకు ఖాతా రిస్క్ లో ప‌డ్డ‌ట్లే, నెటిజ‌న్ల‌కు కేంద్ర హోంశాఖ హెచ్చ‌రిక‌

సందేహాల కోసం

దరఖాస్తు ఫారంలోని అంశాలపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను అధికారులు తీర్చలేకపోవటంతో పలుచోట్ల వాగ్వాదాలు చోటుచేసుకొన్నాయి. ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్‌ రూమ్‌ నంబరు- 040-23120410కు ఫోన్‌ చేయాలని అధికారులు సూచించారు. దరఖాస్తు ఫారం emunicipal.telangana. gov.in వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉన్నదని వివరించారు.



సంబంధిత వార్తలు

AP Sankranti Holidays: జనవరి 10 నుంచి 19వ తేదీ వరకూ ఏపీలో సంక్రాంతి సెలవులు.. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్న ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి

Farmers Protest: కనీస మద్దతు ధరపై రైతుల పోరాటం, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కిసాన్ నాయకుడికి తక్షణ వైద్య సహాయం అందించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరిన సుప్రీంకోర్టు

Telangana Student Dies In US: అమెరికాలో మ‌రో తెలంగాణ విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి.. కారులో శ‌వ‌మై క‌నిపించిన యువకుడు.. బాధితుడు హ‌నుమ‌కొండ జిల్లా వాసి బండి వంశీగా గుర్తింపు

SBI Alert! ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటూ ఎస్బీఐ మేనేజర్ల పేరిట డీప్ ఫేక్ వీడియోలు, నమ్మొద్దని కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసిన ఎస్బీఐ