Medaram Invitation for President: సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించాం.. మంత్రి సీతక్క వెల్లడి.. దేశంలోనే టిక్కెట్ లేని దేవాలయమంటూ కొనియాడిన వైనం

సోమవారం నాడు మేడారంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పర్యటించారు.

Medaram Sammakka Saralamma Jatara (Photo-Twitter)

Hyderabad, Feb 6: ఆసియా (Asia) ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు (Medaram Sammakka-Saralamma Jathara) రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని (President Draupadi Murmu) ఆహ్వానించినట్లు తెలంగాణ మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం నాడు మేడారంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఇక్కడ జరుగుతోన్న పనులను పరిశీలించారు. ఆర్టీసీ బస్సుల పార్కింగ్ ప్రదేశాలను మంత్రులు తనిఖీ చేశారు. ఆ తర్వాత పార్కింగ్ ప్రదేశాల నుంచి సమ్మక్క, సారలమ్మ దేవతల గద్దె వరకు ఆర్టీసీ బస్సులో మంత్రులు ప్రయాణించారు. మేడారం జాతరకు వచ్చే బస్సులు, వెళ్లే పార్కింగ్ స్థలాలు, బస్ షెల్టర్లు , క్యూలైన్ వార్డులు, ఆర్టీసీ ఉద్యోగుల షెల్టర్లు మంత్రులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు వివరించారు. ఆ తర్వాత మంత్రులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. అనంతరం సీతక్క మాట్లాడారు.

PM Modi Speech in Lok Sabha: ఎవరు ఏం అనుకున్నా హ్యాట్రిక్ విజయం మాదే, 400 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని హామీ

ఈసారి 6000 బస్సులు

మేడారంకు జాతీయ హోదా దక్కుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జాతర ఉంటుందన్నారు. ఆ నాలుగు రోజులు దేవతలు గద్దెలపై కొలువై ఉంటారన్నారు. బహుశా దేశంలో ఎలాంటి టిక్కెట్ లేని దేవాలయం ఇదొక్కటే కావొచ్చు అన్నారు. కుల, మత వివక్షత లేదని... అందరూ వన దేవతలను దర్శించుకోవచ్చని పేర్కొన్నారు. గత జాతరలో 2800 బస్సులు మాత్రమే నడిపారని... ఈసారి 6000 బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు.

కాంగ్రెస్ దుకాణానికి తాళం వేసే సమయం ఆసన్నమైంది, లోక్ సభ వేదికగా ప్రధాని మోదీ ధ్వజం, వీడియో ఇదిగో..



సంబంధిత వార్తలు

Transgender for Traffic Control: హోంగార్డుల తరహాలో ట్రాన్స్‌ జెండర్ల సేవలు.. ట్రాఫిక్‌ నియంత్రణకు వినియోగించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి.. అధికారులకు ఆదేశం

KTR: కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తారని ప్రచారం?, భారీగా కేటీఆర్‌ ఇంటికి బీఆర్ఎస్ నేతలు, ఎవనిదిరా కుట్ర..ఏంది ఆ కుట్ర? అని మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,నిజానికి ఉన్న దమ్మేంటో చూద్దామని సవాల్

KTR on AMRUT Tender Scam: రాష్ట్రానికి కేటాయించిన రూ.8,888 కోట్ల పనులపై కేంద్రం విచారణ జరిపించాలి, అమృత్‌ టెండర్ల అవినీతిపై అన్ని ఆధారాలున్నాయని తెలిపిన కేటీఆర్

Amaravati: ఇక శ‌ర‌వేగంగా ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌నులు, రూ. 15వేల కోట్ల రుణం వాడ‌కంపై ఉత్త‌ర్వులు ఇచ్చిన ప్ర‌భుత్వం, పనులు వేగవంతం చేయ‌నున్న సీఆర్టీఏ