Dil Raju: తప్పైపోయింది.. క్షమించండి, తనను రాజకీయాల్లోకి లాగొద్దని నిర్మాత దిల్ రాజు విజ్ఞప్తి, వివాదానికి ముగింపు పలికిన దిల్ రాజు

తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పారు నిర్మాత దిల్ రాజు. తెలంగాణ లో కల్లు ,మటన్ కే వైబ్ ఉంటుంది. సినిమాలకు ఆ తర్వాతే ప్రాధాన్యత అని కామెంట్ చేశారు.

Dil Raju says sorry to his comments on Telangana People(video grab)

Hyd, January 11:  తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పారు నిర్మాత దిల్ రాజు. తెలంగాణ లో కల్లు ,మటన్ కే వైబ్ ఉంటుంది. సినిమాలకు ఆ తర్వాతే ప్రాధాన్యత అని కామెంట్ చేశారు. ఇది వివాదానికి దారి తీయగా ఎట్టకేలకు సారీ చెప్పారు దిల్ రాజు.

ఒక తెలంగాణ వాసిగా అందులో నిజామాబాద్ వాసిగా తనకు పుట్టిల్లు.. ఆ జిల్లా వాసిగా అక్కడ తన సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ నిర్వహించామని చెప్పారు.అక్కడ తాను కొన్ని మాటలను అనని వాటిని వక్రీకరించారన్నారు. గేమ్ ఛేంజ‌ర్ తొలిరోజే రూ.186 కోట్లు వసూళ్లు, సంక్రాంతి రేసులో వసూళ్ల జోరు కొనసాగిస్తున్న గేమ్ ఛేంజర్ 

తెలంగాణ కల్చర్ లో భాగం అయిన మటన్, కల్లు గురించి సంభోదించానని...రెండు పెద్ద సినిమాలతో బిజీగా ఉండటంతో మన తెలంగాణ కల్చర్ అయిన దావత్ ను మిస్ అవుతున్నాను అని చెప్పానన్నారు.

Dil Raju says sorry to his comments on Telangana People

#DilRaju garu has spoken out about the Nizamabad incident, offering his sincere apologies to anyone who may have been hurt. He has requested not to associate him with politics in any way. pic.twitter.com/X9W3grU8O0

రెండు సినిమాలు విడుదలైన తర్వాత దావత్ చేసుకొంటానని చెప్పానని .. నా వ్యాఖ్యల పట్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమాపణలు చెబుతున్నా అని ఈ వివాదానికి ఎండ్ కార్డ్ పలికారు. ఇక గేమ్ ఛేంజర్ తొలి రోజు 185 కోట్లు వసూలు చేసి సత్తాచాటింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now