16th Finance Commission Meet: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటా 41 నుంచి 50 శాతానికి పెంచాలి: 16వ ఆర్ధిక సంఘం సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి

ప్రజాభవన్‌లో జరిగిన 16వ ఆర్ధిక సంఘం సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని పేర్కొన్నారు.

Revanth Reddy (photo-X/Revanth Reddy)

Hyd, Sep 10: దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని..అందుకే ది ఫ్యూచర్ స్టేట్‌గా పిలుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో జరిగిన 16వ ఆర్ధిక సంఘం సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని పేర్కొన్నారు. మన దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ... ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. భారీ రుణ భారం తెలంగాణకు సవాల్‌గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు భారీగా అప్పులు చేశారు. ఆదాయంలో అధికంగా రుణాల చెల్లింపులకే వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. రుణాలు, వడ్డీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించాల్సి ఉంది. నిర్వహణ సరిగా లేకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం పడుతుంది. రుణ సమస్య పరిష్కారానికి తగిన సహాయం, మద్దతు ఇవ్వాలి. రుణాల్ని రీస్ట్రక్చర్‌ చేసే అవకాశం ఇవ్వాలి. రీస్ట్రక్చర్‌ చేయకపోతే అదనపు ఆర్థిక సాయం చేయాలి. తెలంగాణను ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం. దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మా వంతు బాధ్యత నెరవేరుస్తాం’’అని సీఎం రేవంత్‌ తెలిపారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోండి, తెలంగాణ స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు వీరే..

గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణ భారం రూ.6.85 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్-బడ్జెట్ రుణాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుందని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రుణాలు, వడ్డీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో రుణాల సమస్యను పరిష్కరించేందుకు మాకు తగిన సహాయం, మద్దతు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. రుణాన్ని రీ స్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలని.. లేదా మాకు అదనపు ఆర్ధిక సహాయాన్ని అందించాలని రేవంత్ పేర్కొన్నారు.

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41% నుంచి 50%కి పెంచాలన్నారు. అన్ని రాష్ట్రాల తరపున ఈ డిమాండ్‌ను మీ ముందు ఉంచుతున్నామన్నారు. ఈ డిమాండ్ ను మీరు నెరవేర్చితే.. దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎంచుకున్న లక్ష్య సాధనకు తాము సంపూర్ణంగా సహకరిస్తామన్నారు.

తెలంగాణకు తగినంత సహాయం అందించాలని.. దేశాన్ని ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మా వంతు బాధ్యతను నేరవేరుస్తామన్నారు. ఫిస్కల్ ఫెడరలిజాన్ని బలోపేతం చేయడంలో మీ మద్దతు కోరుతున్నామని తెలిపారు. తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు మీ సిఫారసులు ఉపయోగపడతాయని మేం నమ్ముతున్నామని రేవంత్ పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు

Notice to Sajjala Bhargav: వైఎస్సార్సీపీ నేత‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, స‌జ్జ‌ల భార్గ‌వ్, వైఎస్ జ‌గ‌న్ బంధువు అర్జున్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

KTR: సీఎం రేవంత్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేద్దాం..భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి