RGV on Revanth Reddy & KTR: రేవంత్ రెడ్డి, కేటీఆర్ పై ఆర్జీవీ సెన్సేష‌న‌ల్ పోస్ట్, ఇంత‌వ‌ర‌కు ఇలాంటి నాయ‌కుల‌ను చూడ‌లేదంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన రామ్ గోపాల్ వ‌ర్మ‌

“ఇప్పుడు ఈ ఓటమి మీద మీరు చేసిన మాటలకు కూడా అంతం లేదు సర్. ఎందుకంటే ఓటమిని ఇంత పాజిటివ్ గా తీసుకున్న ఏ పొలిటికల్ లీడర్ ని నేను చూడలేదు. ఆ విషయంలో మీకు హ్యాట్సాఫ్. ఇలాంటి ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యమే అందరికి కావాల్సింది” అంటూ ట్వీట్ చేశారు.

RGV on Revanth Reddy & KTR (PIC@ X)

Hyderabad, December 03: సినిమా టు పాలిటిక్స్ ఏదొక విషయం పై సంచలన వ్యాఖ్యలు చేసే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా బిఆర్‌ఎస్ లీడర్ కేటీఆర్ పై ప్రశంస చేస్తూ ట్వీట్ చేశారు. నేడు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్ డే అన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇక ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పరాజయం పాలవ్వడంతో కేటీఆర్ (KTR) ఒక ట్వీట్ చేశారు. ‘నిన్న కేటీఆర్ తన ట్విట్టర్ లో గన్ పట్టుకున్న ఓ ఫోటో షేర్ చేస్తూ హ్యాట్రిక్ విజయం ఖాయం. సెలబ్రేషన్స్ కి సిద్దంకండి’ అంటూ ట్వీట్ చేశారు. నేడు ఆ ట్వీట్ ని తానే రీట్వీట్ చేస్తూ కేటీఆర్ ఇలా రాసుకొచ్చారు.. “విజయం పై నేను చేసిన మాటలకు అంతం లేదు. కేవలం ఈసారి మిస్ అయ్యింది అంతే” అంటూ ఓటమని కూడా స్పోర్టివ్ గా తీసుకుంటూ ట్వీట్ చేశారు.

 

ఇక ఈ ట్వీట్ కి ఆర్జీవీ రెస్పాండ్ అవుతూ.. “ఇప్పుడు ఈ ఓటమి మీద మీరు చేసిన మాటలకు కూడా అంతం లేదు సర్. ఎందుకంటే ఓటమిని ఇంత పాజిటివ్ గా తీసుకున్న ఏ పొలిటికల్ లీడర్ ని నేను చూడలేదు. ఆ విషయంలో మీకు హ్యాట్సాఫ్. ఇలాంటి ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యమే అందరికి కావాల్సింది” అంటూ ట్వీట్ చేశారు. ఆర్జీవీతో పాటు కేటీఆర్ ట్వీట్ పై ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి

 

కాగా రామ్ గోపాల్ వర్మ, రేవంత్ రెడ్డి (Revanth Reddy)గురించి కూడా ట్వీట్ చేశారు. “కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో పరాజయాన్ని ఎదుర్కొంది. తెలంగాణ విజయం చూస్తుంది. అయితే ఈ విజయం కాంగ్రెస్‌ది కాదు రేవంత్ రెడ్డిది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీరు మీ బాహుబలి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేయాలి” అంటూ ట్వీట్ చేశారు. అలాగే జీవితంలో మొదటిసారి రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ పై గౌరవం కలుగుతుందని చెప్పుకొచ్చారు. గౌరవిలైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూస్తే చాలా గర్వంగా ఉందంటూ పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు

DGP Jitender: వారు సినిమాల్లోనే హీరోలు...బయట పౌరులే, చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న డీజీపీ జితేందర్, మోహన్ బాబుది ఫ్యామిలీ పంచాయితీ అన్న తెలంగాణ డీజీపీ

MP Kiran Kumar Reddy: అల్లు అర్జున్‌పై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్, బన్నీ రియల్ హీరో కాదు, స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివారని ఆగ్రహం వ్యక్తం చేసిన భువనగిరి ఎంపీ

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

CM Revanth Reddy: సర్వమత సమ్మేళనంం తెలంగాణ, మత విద్వేషాలు రెచ్చగోడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ల సంక్షేమం- అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎం

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif