Telangana: తెలిసిన వాళ్లే దారుణంగా రేప్ చేస్తున్నారు, తెలంగాణలో 23 శాతానికి పైగా పెరిగిన అత్యాచార కేసులు, రాష్ట్రంలో మొత్తం నేరాలు 4.65 శాతం పెరిగాయని తెలిపిన పోలీస్ అధికారులు
కాగా 2020లో 1,934 అత్యాచార కేసులు నమోదయ్యాయి. కేవలం 26 కేసుల్లో మాత్రమే గుర్తుతెలియని నిందితులు అత్యాచారాలకు పాల్పడ్డారని తేలింది
Hyd, Dec 31: తెలంగాణలో 2021లో అత్యాచారాల కేసులు 23 శాతానికి పైగా పెరిగాయని (Rape Cases Shoot Up by 23% in Telangana), రాష్ట్రంలో మొత్తం నేరాలు 4.65 శాతం పెరిగాయని రాష్ట్ర పోలీసులు శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం ఉన్న సాంకేతికతపై ప్రజలకు అవగాహన ఉండడంతో పాటు ఆన్‌లైన్ పద్ధతిపై అవగాహన ఉండడంతో పోలీస్‌స్టేషన్‌లకు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో పిటిషన్లు వేయడం విపరీతంగా పెరిగిపోయిందని, మొత్తంగా ఇదే నేరాల కేసులు పెరగడానికి కారణమని పోలీసులు తెలిపారు.
ప్రస్తుత సంవత్సరం 2021లో మొత్తం 2,382 రేప్ కేసులు (Rape Cases) నమోదయ్యాయి. ఈ కేసులను స్టడీ చేయగా ఎక్కువ భాగం అత్యాచార బాధితులకు నేరస్థులు తెలిసిన వారేనని పోలీసులు తెలిపారు. కాగా 2020లో 1,934 అత్యాచార కేసులు నమోదయ్యాయి. కేవలం 26 కేసుల్లో మాత్రమే గుర్తుతెలియని నిందితులు అత్యాచారాలకు పాల్పడ్డారని తేలింది. మిగిలిన 2,356 కేసుల్లో, బాధితులు సన్నిహిత కుటుంబ సభ్యులు/స్నేహితులు/ప్రేమికులు/సహోద్యోగులు/పరిచయం ఉన్న వారిచే అత్యాచారానికి గురయ్యారు. మహిళలపై నేరాల కింద 17,058 కేసులు నమోదు కాగా, POCSO (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ) చట్టం కింద ప్రస్తుత సంవత్సరంలో 2,565 కేసులు నమోదయ్యాయి.
వివిధ కార్యక్రమాల కారణంగా, సంవత్సరానికి ఎమర్జెన్సీ కాల్‌ల ప్రతిస్పందన సమయం 2019లో 10 నిమిషాల నుండి 2021లో 7 నిమిషాలకు తగ్గించబడిందని రాష్ట్ర పోలీసులు తెలిపారు. 2021లో తెలంగాణలో అత్యాచారాల కేసులు 23 శాతానికి పైగా పెరిగాయని, రాష్ట్రంలో మొత్తం నేరాలు 4.65 శాతం పెరిగాయని రాష్ట్ర పోలీసులుచెప్పారు.