Congress SC, ST Declaration: ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్, అధికారంలోకి వస్తే దళిత, గిరిజనులకు రిజర్వేషన్లు, ఆర్ధిక సాయం పెంచుతామంటూ హామీ, ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామంటూ స్పష్టం చేసిన ఖర్గే
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ చదువుతుండడంతో తన జన్మ ధన్యమైనట్లు భావిస్తున్నానని చెప్పారు. దళితులు, గిరిజనులను ఆదుకోవడానికి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
derabad, AUG 26: తెలంగాణ ఎన్నికల (Telangana elections 2023) వేళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ (Sc, St Declaration) చదువుతుండడంతో తన జన్మ ధన్యమైనట్లు భావిస్తున్నానని చెప్పారు. దళితులు, గిరిజనులను ఆదుకోవడానికి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే సమక్షంలో రేవంత్.. దళిత డిక్లరేషన్ ప్రకటించారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కేవీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాగర్జన సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తొలుత గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఖర్గే సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యకర్తలు భారీగా రావడంతో శంకరంపల్లి వెళ్లే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ (sonia gandhi) సూచన మేరకు ఎస్సీ, ఎస్టీ డిక్లకేషన్ ప్రకటిస్తున్నట్టు చెప్పారు.
డిక్లరేషన్ ముఖ్యాంశాలు
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ చేస్తాం
అంబేద్కర్ అభయహస్తం పేరుతో రూ.12 లక్షల ఆర్థిక సహాయం
ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు పెంచుతాం
ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేస్తాం
ఇందిరమ్మ ఇంటి స్కీమ్, స్థలం లేని వాళ్ళకి స్థలం ఇచ్చి అరు లక్షల ఆర్థిక సాయం చేస్తాం
అసైన్డ్, అటవీభూములు, పోడు భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం
పోడు భూములకు పట్టాలు
ఎస్సీ, ఎస్టీలకు 3 కార్పొరేషన్ల చొప్పున ఏర్పాటు చేస్తాం
రాష్ట్రంలో కొత్తగా 5 ఐటీడీఏలు ఏర్పాటు చేస్తాం
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పదో తరగతి పాస్ అయితే రూ.10 వేలు ఇస్తాం