Revanth on Ponnala: జనగామ రేసులో పొన్నాల పేరు కూడా సెలక్ట్ చేశాం! పీసీసీ చీఫ్‌గా ఉండి 40వేల ఓట్లతో ఓడిపోయాడంటూ ఫైరయిన రేవంత్ రెడ్డి, పార్టీ మారేందుకు పొన్నాలకు సిగ్గులేదంటూ ఘాటువ్యాఖ్య

పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ కి రాజీనామా చేయడంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్లు పార్టీలో ఉండి ఇప్పుడు పార్టీ మారడానికి సిగ్గుండాలన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ గా, మంత్రిగా పని చేశారు.

TPCC Chief Revanth Reddy

Hyderabad, OCT 13:  కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) రాజీనామా వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్రంగా స్పందించారు. పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ కి రాజీనామా చేయడంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్లు పార్టీలో ఉండి ఇప్పుడు పార్టీ మారడానికి సిగ్గుండాలన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ గా, మంత్రిగా పని చేశారు. ఇదేం తీరు? అని పొన్నాలపై ధ్వజమెత్తారు. ప్రజల్లో ఉంటే ప్రజాసేవ చేస్తే ఎందుకు గెలవరు? అని పొన్నాలను ప్రశ్నించారు.

 

”పీసీసీ చీఫ్‌ గా ఉండి 40వేల ఓట్లతో ఓడిపోయారు. రెండోసారి ఇస్తే 50వేల ఓట్లతో ఓడిపోయారు. అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. ఏ కారణంతో ఆ చిల్లర కామెంట్ చేశారు. జనగాం టికెట్ పై (Jangon) ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేశాం. అందులో పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు. పార్టీని దెబ్బతీయడానికి, వీక్ చేయడానికి పొన్నాల (Ponnala) ఈ నిర్ణయానికి వచ్చారు.

Telangana Assembly Elections 2023: తెలంగాణాలో కొత్తగా నియమితులైన ఎస్పీలు, కమిషనర్ల లిస్ట్ ఇదిగో, పెండింగ్‌లో హైదరాబాద్‌ సీపీ పోస్ట్ 

పొన్నాల లక్ష్మయ్య కార్యకర్తలకు క్షమాపణ చెప్పి బేషరతుగా రాజీనామాను ఉపసంహరించుకోవాలి. అన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతే అభ్యర్థులపై ఒక నిర్ణయానికి వచ్చాం. రేవంత్ రెడ్డి పైసలు తీసుకున్నాడని ఎవరైనా అన్నం తినే వాళ్ళు అంటారా? రేవంత్ రెడ్డి ఒక్కడే టికెట్లు ఇవ్వడు. ఒక ప్రాసెస్ ప్రకారం టికెట్లు ఇస్తాం. సీఈసీ అనేది కాంగ్రెస్ లో ముఖ్యమైనది. వాళ్లే టికెట్లు, అభ్యర్థులను ఖరారు చేస్తారు.

KTR Tweet on Congress: బెంగళూరులో పట్టుబడ్డ రూ. 42 కోట్లపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్, అవన్నీ తెలంగాణకు పంపేందుకు దాచినవే అంటూ పోస్ట్, తెలంగాణలో స్కామ్‌ గ్రెస్‌ కు చోటు లేదన్న కేటీఆర్ 

విడతలవారిగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బస్సు యాత్ర ఉంటుంది. దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణపైన ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. 75 సీట్లకుపైగా కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది మధ్యలో ఆరు గ్యారెంటీలపై సంతకం పెడతాం” అని రేవంత్ రెడ్డి అన్నారు.



సంబంధిత వార్తలు

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం

CM Revanth Reddy: రూ.192 కోట్లతో మెదక్‌ జిల్లాలో అభివృద్ధి పనులు, ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పలు శంకుస్థాపనలు

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ