Telangana: హనుమాన్ దుస్తులతో స్కూలుకు విద్యార్థులు, తీవ్ర అభ్యంతరం తెలిపిన హెడ్ మాస్టర్, కోపంతో స్కూలును ధ్వంసం చేసిన విద్యార్థులు, వీడియో వైరల్
మంచిర్యాల కన్నెపల్లి గ్రామంలోని బ్లెస్డ్ మదర్ థెరిసా హైస్కూలు హనుమాన్ దీక్షా దుస్తులు ధరించి కొందరు విద్యార్థులు విద్యా సంస్థకు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పాఠశాల కరస్పాండెంట్, హెడ్ మాస్టర్ పై మంచిర్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.
మంచిర్యాల కన్నెపల్లి గ్రామంలోని బ్లెస్డ్ మదర్ థెరిసా హైస్కూలు హనుమాన్ దీక్షా దుస్తులు ధరించి కొందరు విద్యార్థులు విద్యా సంస్థకు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పాఠశాల కరస్పాండెంట్, హెడ్ మాస్టర్ పై మంచిర్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మంగళవారం పాఠశాల అధికారులపై సెక్షన్ 153 (ఎ) (మతం లేదా జాతి ఆధారంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295 (ఎ) (మత భావాలను అవమానించడం) కింద కేసు నమోదు చేసినట్లు దండేపల్లి పోలీసులు తెలిపారు. దారుణం, కొడుకు కళ్లముందే తండ్రిని చావబాదిన పోలీసులు, తండ్రిని కొట్టవద్దని కొడుకు పోలీసులు కాళ్లు పట్టుకున్నా వదలకుండా..
కాషాయ దుస్తులు ధరించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ ప్రశ్నించడంతో విద్యార్థులు స్కూలును ధ్వంసం చేశారు. 21 రోజుల పాటు నిర్వహించే హనుమాన్ దీక్షకు విద్యార్థులు కాషాయ వస్త్రాలు ధరించడం ప్రిన్సిపాల్ జైమన్ జోసెఫ్ గమనించారు. ప్రధానోపాధ్యాయుడు హిందూ వస్త్రధారణను అనుమతించడం లేదని పేర్కొంటూ ఒక వీడియో వైరల్ అయిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.
Here's VIdeos
కాషాయ దుస్తులు ధరించిన పురుషులు జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ కిటికీ అద్దాలను పగులగొట్టడం వీడియోలో చూడవచ్చు. క్యాంపస్‌లోని మదర్ థెరిసా విగ్రహంపై గుంపు రాళ్లు రువ్వుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. కొంతమంది వ్యక్తులు ప్రిన్సిపాల్ జోసెఫ్‌ను చుట్టిముట్టి అతని నుదిటిపై బలవంతంగా తిలకం దిద్దారు. కొంతమంది వ్యక్తులు పాఠశాల యాజమాన్యం నుండి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు జోసెఫ్ సహా ఇద్దరు సిబ్బందిపై కేసు నమోదు చేశారు.