Rs 25,000 Monthly Pension for Padma Shri Winners: పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ప్రతి నెలా రూ.25 వేల పింఛన్.. జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు గౌరవ పింఛన్ ఇస్తామంటూ గతంలో ప్రకటించిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా అందుకు సంబంధించిన జీవోను సోమవారం విడుదల చేసింది.
Hyderabad, July 23: పద్మశ్రీ (Padma Shri) పురస్కార గ్రహీతలకు గౌరవ పింఛన్ (Pension) ఇస్తామంటూ గతంలో ప్రకటించిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా అందుకు సంబంధించిన జీవోను సోమవారం విడుదల చేసింది. అవార్డు గ్రహీతలకు నెల నెలా రూ. 25 వేల చొప్పున పింఛన్ ఇచ్చేందుకు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పద్మశ్రీ గ్రహీతలకు ఇక నుంచి ప్రతి నెల 25 వేల రూపాయల గౌరవ పెన్షన్ అందుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
ఘనంగా సత్కారం
పద్మశ్రీ అవార్డు గ్రహీతలను గతంలో హైదరాబాద్ లోని శిల్పరామంలో రేవంత్ ఘనంగా సత్కరించిన విషయం విదితమే. ఇటీవలే పద్మశ్రీ గ్రహీతలందరికీ ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున నజరానా కూడా అందించారు.
భార్యతో భర్త అసహజ శృంగారం చేయడం అత్యాచారం కిందకు రాదు, భార్య పిటిషన్ కొట్టేసిన ఉత్తరాఖండ్ హైకోర్టు