Jagtial: రన్నింగ్ లో ఉండగానే ఊడిపోయిన ఆర్టీసీ బస్సు టైర్, ప్రమాద సమయంలో 150 మంది ప్రయాణికులు, డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ముప్పు
ఈ క్రమంలో బస్సు జగిత్యాల శివారు మొరపల్లి గ్రామం వద్దకు చేరుకోగానే వెనుకాల రెండు చక్రాలు ఊడిపోయి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సుని నిలుపడంతో భారీ ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాకుండా బయటపడ్డారు. వరుసగా సెలవులు రావడంతో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కళకళలాడుతున్నా
Jagtial, AUG 17: జగిత్యాల జిల్లాల్లో ఆర్టీసీ బస్సుకు (TGSRTC) తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్ నడుస్తున్న సమయంలో వెనుకాల చక్రాలు రెండు ఊడిపోయాయి(Rtc Bus Wheels Blown). డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పినట్లయ్యింది. సంఘటన జరిగిన సమయంలో 150 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల నుంచి నిర్మల్‌కు పల్లె బస్సు వెళ్తున్నది. ఈ క్రమంలో బస్సు జగిత్యాల శివారు మొరపల్లి గ్రామం వద్దకు చేరుకోగానే వెనుకాల రెండు చక్రాలు ఊడిపోయి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సుని నిలుపడంతో భారీ ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాకుండా బయటపడ్డారు.
వరుసగా సెలవులు రావడంతో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. ఎక్కువ బస్సులు లేకపోవడంతో, ఉన్న బస్సులు సమయానికి రాకపోవడంతో అందుబాటులో ఉన్న బస్సుల్లోనే ప్రయాణికులు పరిమితికి మించి వెళ్తున్నారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 150 మంది వరకు ఉన్నట్లు తెలుస్తున్నది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.