Telangana Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ ఆశావాహులకు నిరాశేనా...సీఎం రేవంత్ రెడ్డి మనస్సులో ఏముంది...ఈ దీపావళికైనా కేబినెట్ విస్తరణ ఉంటుందా?

తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పుడు?, దసరా వచ్చింది పోయింది..కానీ కేబినెట్ విస్తరణ మాత్రం జరగలేదు..సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు జోరందుకుంటున్న ఆశావాహులకు మాత్రం నిరాశే ఎదురవుతోంది.

rumours on telangana cabinet expansion!(X)

Hyd, Oct 13: తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పుడు?, దసరా వచ్చింది పోయింది..కానీ కేబినెట్ విస్తరణ మాత్రం జరగలేదు..సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు జోరందుకుంటున్న ఆశావాహులకు మాత్రం నిరాశే ఎదురవుతోంది.పది సంవత్సరాల తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలకు ఆ సంతృప్తి మాత్రం ఉండటం లేదు. ఓ వైపు నామినేటెడ్ పోస్టులు మరోవైపు మంత్రివర్గ విస్తరణలో తమకు ఛాన్స్ వస్తుందని భావిస్తున్న సీనియర్ నేతల కోరిక మాత్రం నెరవేరడం లేదు.

అదిగో మంత్రివర్గ విస్తరణ అంటే ఇదిగో అన్నట్లు తయారైంది కేబినెట్ విస్తరణ. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి తమకు మంత్రి పదవి ఖాయమని అనుచరులతో చెప్పుకుంటున్న ప్రజాప్రతినిధులు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అయితే ఆశావాహులు మాత్రం తమ ప్రయత్నాలను ఆపడం లేదు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీ పెద్దలను కలిసి ఇప్పటికే వినతిపత్రం కూడా ఇచ్చారు.  కొండారెడ్డిపల్లి దసరా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజలు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం

వాస్తవానికి ఈ దసరాకి కేబినెట్ విస్తరణ ఉంటుందని భావించగా అలాంటి వాతావరణమే కనిపించలేదు. అయితే తాజాగా మరోసారి దీపావళికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడానికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది.

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా కాంగ్రెస్ పెద్దలతో పలు మార్లు సంప్రదింపులు జరిపినా ఫలితం ఉండటం లేదు. అయితే తాజాగా దీపావళి పండగ తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతోండగా ఈసారైనా ఉంటుందా లేదా అన్న అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి.



సంబంధిత వార్తలు