CM Revanth Reddy: కొండారెడ్డిపల్లి దసరా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజలు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి దసరాకు తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికు వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. కొండారెడ్డిపల్లి గ్రామస్తుల ఆనందోత్సాహాల మధ్య శనివారం ముఖ్యమంత్రి దసరా పండుగ జరుపుకున్నారు. గ్రామస్తులంతా ఊరేగింపుగా జమ్మి చెట్టువద్దకు రాగా ముఖ్యమంత్రి గారు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి జమ్మి పూజలో పాల్గొన్నారు. అంతకు ముందు వారు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ కోట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

CM Revanth Reddy: కొండారెడ్డిపల్లి దసరా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి,  జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజలు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం
CM Revanth Reddy Inagurates development works at Kondareddypally(X)

Hyd, Oct 13: సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి దసరాకు తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికు వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. కొండారెడ్డిపల్లి గ్రామస్తుల ఆనందోత్సాహాల మధ్య శనివారం ముఖ్యమంత్రి దసరా పండుగ జరుపుకున్నారు. గ్రామస్తులంతా ఊరేగింపుగా జమ్మి చెట్టువద్దకు రాగా ముఖ్యమంత్రి గారు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి జమ్మి పూజలో పాల్గొన్నారు. అంతకు ముందు వారు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ కోట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గ్రామంలో రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామ పంచాయతీ భవనం ఎదుట మామిడి మొక్కను నాటారు. రూ. 55 లక్షలు వెచ్చించి అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన మోడల్ గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. రూ. 18 లక్షల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు.   సొంతూరు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌ రెడ్డి... తొలిసారి స్వగ్రామంలో సీఎం హోదాలో రేవంత్‌ దసరా వేడుకలు... 

Here's Tweet:

 రూ.18 కోట్లతో చేపట్టే భూగర్భ మురుగు నీటి పైప్ లైన్ నిర్మాణం, మురుగునీటి శుద్ధి కేంద్రం, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 64 లక్షలతో అత్యాధునిక ప్రయాణ ప్రాంగణ నిర్మాణం, ప్రధాన రహదారి గుండా విద్యుత్ దీపాలంకరణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 32 లక్షల వ్యయంతో చిల్డ్రన్స్ పార్క్, వ్యాయామశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.70 లక్షలతో అధునాతన సదుపాయాలతో కమ్యూనిటీ భవనం, ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు.

Here's Tweet:

(The above story first appeared on LatestLY on Oct 13, 2024 10:12 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).