IPL Auction 2025 Live

Rythu Bandhu 2021: రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, రేపటినుంచి రైతు బంధు నిధులు విడుదల, రైతుబంధు కోసం దాదాపు రూ. 7,500 కోట్లను సిద్ధం చేస్తున్న తెలంగాణ ఆర్థికశాఖ

రేపటి నుంచి రైతుబంధు నిధులను (Rythu Bandhu 2021) పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోకే జమకానున్నాయి. వీలైనంత త్వరగా రైతులందరి అకౌంట్లలోకి డబ్బు జమ (Telangana farmers will get Rythu Bandhu funds) అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

Image used for representational purpose. | (Photo-PTI)

Hyd, Dec 14: రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. రేపటి నుంచి రైతుబంధు నిధులను (Rythu Bandhu 2021) పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోకే జమకానున్నాయి. వీలైనంత త్వరగా రైతులందరి అకౌంట్లలోకి డబ్బు జమ (Telangana farmers will get Rythu Bandhu funds) అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రైతుబంధు కోసం దాదాపు రూ. 7,500 కోట్లను సర్దుబాటు చేసేందుకు ఇప్పటికే ఆర్థికశాఖ అధికారులు కసరత్తు పూర్తి చేశారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో డిసెంబర్ 15 నుంచి రైతుల ఖాతాల్లోకి నగదు జమకానుంది. నగదు బదిలీ కార్యక్రమం ఈ నెల చివరి వరకు కొనసాగుతుంది. గత వానాకాలంలో తొలి రోజు ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, రెండో రోజు రెండు ఎకరాల భూమి ఉన్నవారికి, మూడో రోజు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకు, ఆ తర్వాత ఎక్కువ భూమి ఉన్నవారికి రైతుబంధు డబ్బును పంపిణీ చేశారు. ఈ సీజన్ లో కూడా అదే పద్ధతిని అవలంబించాలని అధికారులు భావిస్తున్నారు.